ETV Bharat / state

Rains: వర్షాలతో తడిసి ముద్దవుతున్న తెలుగు రాష్ట్రాలు

తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచి కొడుతున్నాయి. రాజధాని నగరం హైదరాబాద్​తో పాటు రాష్ట్రమంతా వర్షంతో తడిసిపోయింది. లోతట్టు ప్రాంతాలను వరదనీరు ముంచెత్తింది. ఏపీలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురవగా... మరికొన్ని చోట్ల ఎడతెరిపి లేకుండా కురిసి.. వరద నీరు నిలిచిపోయింది.

rains in telugu states
వర్షాలు
author img

By

Published : Jul 14, 2021, 7:42 AM IST

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాలు తడిసి ముద్దవుతున్నాయి. రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో ఎడతెరిపిలేకుండా వానలు కురుస్తున్నాయి. మంగళవారం ఉదయం 8 నుంచి రాత్రి 10 గంటల వరకూ రాష్ట్రంలోని 646 ప్రాంతాల్లో వాన పడింది. అత్యధికంగా కాటారం (జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా), నల్గొండ పట్టణంలో 11 సెం.మీల చొప్పున, వాజేడు (ములుగు), బంట్వారం (వికారాబాద్‌)లలో 9 సెం.మీ, ధర్మవరం (ములుగు) 8.3 సెం.మీ, రెబ్బెన (కుమురం భీం)లో 7.4 సెంటీమీటర్ల చొప్పున వర్షం కురిసింది. అంతకుముందు సోమవారం ఉదయం 8 నుంచి మంగళవారం ఉదయం 8 గంటల వరకూ పలుచోట్ల భారీ వర్షాలు కురిశాయి. అత్యధికంగా రాజన్న సిరిసిల్ల జిల్లా పెద్దూరులో 13.1 సెం.మీ. వర్షపాతం నమోదైంది. భారీ వర్షాలతో పలు ప్రాంతాల్లో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. రోడ్లు జలమయమవ్వడంతో ప్రజలు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు. పంటలు నీట మునిగాయి.

రాజధానిలో..

ఉపరితల ఆవర్తనం ప్రభావంతో జంటనగరాల్లో విస్తారంగా వర్షాలు కురిశాయి. ఎడతెరిపి లేని వర్షంతో నగరవాసులు ఇబ్బందులు పడుతున్నారు. మంగళవారం ఉదయం చిరుజల్లులతో మొదలైన వాన మధ్యాహ్నం కాసేపు విరామం తీసుకుంది. మధ్యాహ్నం తర్వాత తిరిగి మొదలై అన్ని ప్రాంతాల్లో ఎడతెరిపిలేకుండా మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. సికింద్రాబాద్, బేగంపేట, బోయిన్‌పల్లి, మారేడ్‌పల్లి, చిలకలగూడ, అల్వాల్, తిరుమలగిరి, ప్యారడైజ్‌లో వర్షం పడింది. పటాన్‌చెరు, మియాపూర్, చందానగర్, మాదాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గంలో మోస్తరు వర్షం కురిసింది.

బలహీన పడిన అల్పపీడనం

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మంగళవారం బలహీనపడింది. తూర్పు, పశ్చిమ భారత ప్రాంతాల మధ్య గాలులతో ద్రోణి ఉంది. వీటి ప్రభావంతో తెలంగాణలో రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నందున భారీ వర్షాలు కురుస్తున్నాయని వాతావరణశాఖ వివరించింది. వర్షాలతో ఉష్ణోగ్రత సాధారణం కన్నా 5 డిగ్రీల వరకూ తగ్గడంతో చలిగా ఉంటోంది. పగలు సైతం 26 నుంచి 32 డిగ్రీలు నమోదవుతోంది.

ఏపీలో

మంగళవారం ఉదయం నుంచి ఏపీలోని శ్రీకాకుళం, విజయనగరం, గుంటూరు, కృష్ణా, జిల్లాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిశాయి. ఉదయం 8.30 నుంచి రాత్రి 7 గంటల వరకు కురిసింది. శ్రీకాకుళం జిల్లా.. టెక్కలి నియోజకవర్గంలో మంగళవారం ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. టెక్కలి ప్రధాన రహదారిపై నీరు నిలిచిపోవడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఎదురయ్యాయి. భవానీ నగర్, బాపారెడ్డి కాలనీ, రాందాసు పేట ప్రాంతాల్లో నీరు నిలిచిపోయింది. సంతబొమ్మాళి మండలం నౌపడాలో కాలువలు సరిగా లేక వీధుల్లో వరదనీరు నిలిచి యింది. ఇళ్లలోకి నీరు ప్రవేశించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దాన్ని ఆనుకుని వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడింది. దీనికి అనుబంధంగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఈ ప్రభావంతో బుధ, గురువారాల్లో కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో భారీవర్షాలు, చాలాచోట్ల మోస్తరు వానలు కురిసే అవకాశం ఉంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.