ETV Bharat / state

RAINS: రాష్ట్రంలో కుంభవృష్టి.. పలు జిల్లాల్లో జనజీవనం అతలాకుతలం - telangana varthalu

రాష్ట్రంలో కురుస్తున్న కుంభవృష్టితో 24 గంటల వ్యవధిలో సగటున 20 సెంటీ మీటర్ల వాన కురిసింది. అనేక ప్రాంతాల్లో జనజీవనం స్తంభించింది. వికారాబాద్‌, వరంగల్‌, జనగామ, యాదాద్రి భువనగిరి, పెద్దపల్లి జిల్లాలు వర్షాలకు చిగురుటాకులా వణుకుతున్నాయి. పంటపొలాలు, జనావాసాలు నీటమునిగాయి. వాగులు పోటెత్తడంతో లోలెవల్‌ వంతెనలు ప్రమాదకరంగా మారాయి. వరద పరిస్థితిపై రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తత ప్రకటించింది.జిల్లాల్లో అధికారులు క్షేత్రస్థాయిలో ఉండి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ ఆదేశించారు.

RAINS: రాష్ట్రంలో కుంభవృష్టి.. పలు జిల్లాల్లో జనజీవనం అతలాకుతలం

author img

By

Published : Aug 31, 2021, 3:50 AM IST

రాష్ట్రంలో కొద్ది గంటల వ్యవధిలో పలు ప్రాంతాల్లో కుంభవృష్టిలా కురిసిన వానలతో కాలనీలను, రోడ్లను వరద ముంచెత్తింది. ఆదివారం ఉదయం 8 గంటల నుంచి సోమవారం రాత్రి 8 గంటల వరకు పలు ప్రాంతాల్లో కుండపోత వర్షాలు కురిశాయి. అత్యధికంగా 24 గంటల వ్యవధిలో కుమురం భీం జిల్లా దహేగాంలో 20 సెంటీమీటర్ల వర్షం కురిసింది. యాదాద్రి జిల్లా కొలనుపాకలో 19.4, రాజాపేటలో 15.6, జనగామ జిల్లా పాలకుర్తిలో 19, హనుమకొండ జిల్లా హసన్‌పర్తిలో 14, సిద్దిపేట జిల్లా నంగునూరులో 16.2, సముద్రాలలో 15.6, కొండపాక, బెజ్జంకిలో 13, నిర్మల్‌ జిల్లా భైంసాలో 11.8, నల్గొండ జిల్లా చందూరులో 13, కరీంనగర్‌ జిల్లా జమ్మికుంటలో 11 సెంటీమీటర్ల వర్షం కురిసింది.

రహదారులు జలమయం

సిద్దిపేట జిల్లాలో నంగునూరు మండలంలో 8 గ్రామాలు నీటమునిగాయి. కోహెడ, తొగుట, చిన్నకోడూరు, చేర్యాల మండలాల్లో వాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తుండడంతో పలు గ్రామాల మధ్య రాకపోకలు స్తంభించాయి. మంత్రి హరీశ్‌రావు చిన్నకోడూరు, నంగునూరు మండలాల్లోని పలు గ్రామాలను సందర్శించారు. మోయతుమ్మెద వాగు ఉప్పొంగడంతో సిద్దిపేట-ఆలేరు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో గంభీరావుపేట వద్ద లోలెవల్‌ వంతెనపై వరద ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో ఆర్టీసీ బస్సు వంతెన అంచు వరకు కొట్టుకుపోయింది. బస్సులో ఉన్న 25 మంది ప్రయాణికులు కేకలు వేయడంతో స్థానిక రైతులు వారిని రక్షించారు. వేములవాడలో కుండపోత వర్షంతో శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయం చుట్టూ ఉన్న రహదారులు జలమయమయ్యాయి.

రాకపోకలకు అంతరాయం

హనుమకొండ, వరంగల్‌, జనగామ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో రెండు గంటల వ్యవధిలో 10 సెంటిమీటర్లకు పైగా వర్షం కురిసింది. వరంగల్‌ హంటర్‌ రోడ్‌లో ఎన్టీఆర్‌ కాలనీ నీటమునిగింది. హనుమకొండ, వరంగల్‌ జిల్లాల్లో చెరువులన్నీ మత్తడి పోస్తున్నాయి. జనగామ జిల్లా పాలకుర్తి నుంచి తొర్రూరు వెళ్లే మార్గంలో లోలెవల్‌ వంతెనపై రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

ఉమ్మడి నల్గొండ జిల్లాలో..

ఉమ్మడి నల్గొండ జిల్లాలో పలుచోట్ల చెరువు కట్టలు తెగి వరద నీరు రహదారులపై ప్రవహిస్తుండటంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఆలేరు, యాదగిరిగుట్ట మండలాల్లోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.

ఇద్దరు యువతులు గల్లంతు

యాదాద్రి జిల్లా రాజుపేట మండలం కుర్రారం వద్ద వాగు దాటుతూ ఇద్దరు యువతులు గల్లంతయ్యారు. వారిలో ఒకరి మృతదేహం లభ్యమైంది. కుమురం భీం జిల్లా తిర్యాణి మండలం దానపూర్‌ కోలాంగూడ గ్రామానికి చెందిన టేకం డోభి అనే యువకుడు పంగిడిమాదర బుగ్గగూడ వాగులో గల్లంతయ్యాడు. వరంగల్​ నగరంలో ఒక సాఫ్ట్​వేర్​ ఇంజినీర్​ మురుగునీటి కాల్వలో విగతజీవిగా తేలాడు.

అప్రమత్తత ప్రకటించిన ప్రభుత్వం

ఉత్తర తెలంగాణ ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తున్నందున అప్రమత్తంగా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్లు, ఇతర అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ ఆదేశించారు. పూర్వ ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌, ఖమ్మం జిల్లాలలోని లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. నీటిపారుదల, విద్యుత్‌ శాఖ అధికారులు జాగ్రత్తగా పరిస్థితులను ఎప్పటికప్పడు పర్యవేక్షించాలన్నారు. క్షేత్రస్థాయి అధికారులు, ఉద్యోగులు విధిగా జిల్లా కేంద్రాల్లోనే ఉండాలని వర్షాలపై కలెక్టర్లతో నిర్వహించిన దృశ్యమాధ్యమ సమీక్షలో సీఎస్‌ తెలిపారు.

ఇవాళ కూడా వర్షాలు!

ఎగువ నుంచి వరద పోటేత్తడంతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు 2 వరద గేట్లను అధికారులు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మోయతుమ్మెద వాగు నుంచి వరద భారీగా రావటంతో కరీంనగర్‌లోని దిగువ మానేరు జలాశయం 8 గేట్లు ఎత్తారు. ఇవాళ కూడా అక్కడక్కడ భారీ వర్షాలు పడే సూచనలున్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ సంచాలకురాలు నాగరత్న తెలిపారు.

ఇదీ చదవండి: MALLARAM PUMP HOUSE: మల్లారం పంపుహౌస్​లోకి వరద నీరు.. నీటి సరఫరాకు అంతరాయం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.