ETV Bharat / state

రాష్ట్రంలో నేడు, రేపు భారీ వర్షాలు

రాష్ట్రంలో నేడు, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరబాద్​ వాతావరణ కేంద్రం తెలిపింది. గణేశ్​ మండపాల నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకోవాలని తొలిసారి సూచనలు చేసింది.

రాష్ట్రంలో నేడు, రేపు భారీ వర్షాలు
author img

By

Published : Sep 2, 2019, 4:51 AM IST

రాష్ట్రంలో సోమ, మంగళవారాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్​ వాతావరణ కేంద్రం తెలిపింది. తొలిసారి గణేశ్​ మండపాలకు వాతావరణ సూచనలు చేసింది. సోమవారం నుంచి 3 రోజులు వర్షాలు కురుస్తాయని, మండపాల నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్రం సంచాలకుడు వై.కె. రెడ్డి ఆదివారం సూచించారు. బంగాళాఖాతం పశ్చిమ మధ్య ప్రాంతంలో 7.6కిలోమీటర్ల ఎత్తున ఉపరితల ఆవర్తనం ఉంది. దీని ప్రభావంతో సోమవారం అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయి. మధ్యప్రదేశ్​పై 3.6 కిలోమీటర్ల ఎత్తున మరో ఉపరితల ఆవర్తనం ఉంది. వీటి ప్రభావంతో తెలంగాణలో రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని వాతావరణ కేంద్ర అధికారి రాజారావు తెలిపారు.

రాష్ట్రంలో నేడు, రేపు భారీ వర్షాలు

ఇవీ చూడండి: వేడుకలకు సిద్ధమైన ఖైరతాబాద్‌ గణేషుడు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.