రాష్ట్రంలో ఇవాళ అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని వాతావరణ కేంద్రం అధికారి రాజారావు తెలిపారు. మిగతా ప్రాంతాల్లో మోస్తారు వర్షాలు కురుస్తాయన్నారు. వాయువ్య బంగాళాఖాతంలో 1,500 మీటర్ల ఎత్తున ఉపరితల ఆవర్తనం ఉందని... దీని ప్రభావం వల్ల బంగాళాఖాతం ఒడిశా తీర ప్రాంతంలో ఆదివారంలోగా అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయన్నారు. విదర్భ ప్రాంతంలో 3,100 మీటర్ల ఎత్తున మరో ఉపరితల ఆవర్తనం ఉందన్నారు. నిన్న 403 ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. అత్యధికంగా వాజేడులో 78.3, అలుబాకలో 77, వెంకటాపురంలో 67.8, మంగపేటలో 44.8, తిర్యానీలో 40, ఎల్కపల్లిలో 36.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
ఇవీ చూడండి: పోలెపల్లి ఔషధ పరిశ్రమల కాలుష్యంపై చర్యలకు శ్రీకారం