Hyd Rains today: హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం పడుతోంది. సికింద్రాబాద్, బోయిన్‌పల్లి, మారేడుపల్లిలో వర్షం ఏకధాటిగా కురుస్తోంది. తిరుమలగిరి, బేగంపేట్, ఆల్వాల్, ప్యారడైస్, చిలకలగూడ, రైల్వేస్టేషన్ ప్రాంతాలలో వర్షం పడుతోంది. దీనితో రోడ్లపై మురుగునీరు ఏరై పారుతోంది. ఉపరితల ఆవర్తనం కారణంగా రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయని వాతావరణశాఖ తెలిపింది. అర్థరాత్రి నుంచి హైదరాబాద్ వ్యాప్తంగా పలు చోట్ల భారీ వర్షం కురిసింది.
చంపాపేట, సైదాబాద్, సరూర్ నగర్, ఎల్బీ నగర్, ఖైరతాబాద్, శేర్ లింగంపల్లి సహా అనేక ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది. శేరిలింగంపల్లిలో 53.8 మిల్లిమీటర్ల వర్షం కురిసింది. ఇబ్రహీంపట్నంలో 42.5, హయత్ నగర్‌లో 39 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఉపరితల ఆవర్తనం కారణంగా మరో రెండు రోజులపాటు అక్కడక్కడా వర్షం ప్రభావం ఉండే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
ఇవీ చదవండి: