ETV Bharat / state

'తౌక్టే' ఎఫెక్ట్: హైదరాబాద్​లో పలుచోట్ల ఉరుములు, మెరుపుల వర్షం

తౌక్టే తుపాను ప్రభావంతో హైదరాబాద్​ నగరంలో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వాన కురిసింది. వర్షం కారణంగా విద్యుత్​ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. నిత్యావసరాల కోసం బయటకు వచ్చిన ప్రజలు ఇబ్బందులుపడ్డారు.

నగరంలో వర్షం
నగరంలో వర్షం
author img

By

Published : May 18, 2021, 7:48 AM IST

Updated : May 18, 2021, 8:02 AM IST

హైదరాబాద్​లో పలుచోట్ల ఉరుములు, మెరుపుల వర్షం

అరేబియా సముద్రంలో ఏర్పడిన భీకర తుపాను తౌక్టే ప్ర‌భావం వ‌ల్ల హైదరాబాద్​ న‌గ‌రంలో ఈ ఉద‌యం ప‌లుచోట్ల ఉరుములు, మెరుపుల‌తో కూడిన వ‌ర్షం కురిసింది. రాజేంద్రన‌గ‌ర్‌, అత్తాపూర్, బండ్ల‌గూడజాగీర్‌, కిస్మ‌త్‌పుర్‌, గండిపేట్‌, గ‌గ‌న్‌ప‌హాడ్, మ‌ల‌క్‌పేట్‌, దిల్‌సుఖ్‌న‌గ‌ర్‌, కొత్త‌పేట‌, వ‌న‌స్థ‌లిపురం, యూస‌ుఫ్‌గూడ‌, రహ్మ‌త్‌న‌గ‌ర్, కృష్ణానగ‌ర్‌ త‌దిత‌ర ప్రాంతాల్లో మోస్త‌రు జ‌ల్లులు కురిశాయి.

సైదాబాద్​ పరిసర ప్రాంతాలు, సికింద్రాబాద్​, తార్నాక, నాచారం, మల్లాపూర్​, నాగారం, జీడిమెట్ల, సూరారం, ఈసీఐఎల్​ తదితర ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వాన పడింది. వ‌ర్షం కార‌ణంగా ప‌లు ప్రాంతాల్లో విద్యుత్ స‌ర‌ఫ‌రాకు అంత‌రాయం ఏర్ప‌డింది. లాక్‌డౌన్ వేళ నిత్య‌వ‌స‌రాల కోసం ఇళ్ల నుంచి బ‌య‌టికి వచ్చిన ప్ర‌జ‌లు ఇబ్బందులుప‌డ్డారు.

ఇదీ చూడండి: కనికరం చూపని కన్నబిడ్డలు.. ప్రాణగండంతో వృద్ధురాలు

Last Updated : May 18, 2021, 8:02 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.