ETV Bharat / state

hyderabad rains: జంట నగరాల్లో భారీ వర్షం.. చెరువులైన రహదారులు - తెలంగాణలో వానలు

hyderabad rains: జంట నగరాల్లో భారీ వర్షం.. లోతట్టు ప్రాంతాలు జలమయం

author img

By

Published : Sep 2, 2021, 9:33 PM IST

Updated : Sep 2, 2021, 10:45 PM IST

20:55 September 02

hyderabad rains: జంట నగరాల్లో భారీ వర్షం.. లోతట్టు ప్రాంతాలు జలమయం

hyderabad rains: జంట నగరాల్లో భారీ వర్షం.. చెరువులైన రహదారులు

ఉపరితల ఆవర్తనం ప్రభావంతో హైదరాబాద్​ జంట నగరాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఒక్కసారిగా కురిసిన జోరు వానకు రోడ్లన్నీ జలమయమయ్యాయి. నాలాలు పొంగిపొర్లాయి. వివిధ పనుల నిమిత్తం బయటకు వచ్చిన ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

ఏకధాటిగా వర్షం

నగరంలోని కూకట్‌పల్లి, నిజాంపేట్, ప్రగతినగర్‌, కేపీహెచ్‌బీ కాలనీ, హైదర్‌నగర్, బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, పంజాగుట్ట, ఖైరతాబాద్‌, మాదాపూర్‌, కొండాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం, చంపాపేట్‌, సరూర్‌నగర్‌, సైదాబాద్‌, చాంద్రాయణగుట్ట, బార్కస్‌, ఉప్పుగూడ, జహనుమా, షా అలీ బండ, బహదూర్‌పురా, కుత్బుల్లాపూర్‌, జీడిమెట్ల, జగద్గిరిగుట్ట, సూరారం, ముషీరాబాద్, ఆర్టీసీ క్రాస్ రోడ్, చిక్కడపల్లి, విద్యానగర్, అడిక్‌మెట్, గాంధీ నగర్, బోరబండ, అల్లాపూర్, మోతీనగర్, ఎర్రగడ్డ, సనత్‌నగర్‌, ఈఎస్ఐ, అమీర్‌పేట, ఎస్‌.ఆర్‌.నగర్‌, మైత్రీవనం, వెంగళ్​రావు నగర్​, ఉప్పల్, బోడుప్పల్, రామంతాపూర్, పీర్జాదిగూడ, షేక్‌పేట, ఆదిత్యనగర్‌ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.

లక్డీకపూల్‌, నాంపల్లి, పంజాగుట్ట, యూసుఫ్​గూడ, శ్రీనగర్‌, మియాపూర్, చందానగర్, బాలానగర్, చింతల్, వనస్థలిపురం, ఉప్పల్, నిజాంపేట్, శ్రీ కృష్ణనగర్​, సుల్తాన్​బజార్, కోఠి, పురాణాపూల్​, జియాగూడా, షేక్​పేట, పహీడీషరీఫ్, జల్​పల్లి, రాజేంద్రనగర్​, మాదాపూర్‌, కొండాపూర్, గచ్చిబౌలి ప్రాంతాల్లోనూ ఏకధాటిగా వర్షం కురిసింది.  

ట్రాఫిక్ జామ్, విద్యుత్ అవాంతరాలు..

ఒక్కసారిగా కురిసిన జోరు వానతో లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరింది. పలుచోట్ల విద్యుత్​ అంతరాయం ఏర్పడింది. పంజాగుట్ట వద్ద వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మాదాపూర్-కొండాపూర్ మార్గంలో భారీగా వాహనాలు నిలిచిపోయాయి.

వరదకు ఎదురెళ్లి.. కొట్టుకుపోయి.. 

శ్రీ కృష్ణ నగర్​లో చెత్తను తరలించే రిక్షా వరద నీటిలో కొట్టుకుపోయింది. వరద ఉద్ధృతికి పలు తోపుడు బండ్లు నీటిలో కొట్టుకుపోయాయి. ఓచోట వరదకు ఎదురుగా వెళ్లిన వ్యక్తి.. అదుపుతప్పి పడిపోయాడు. వరదకు కొట్టుకుపోతున్న ఆ వ్యక్తిని స్థానికులు చాకచక్యంగా కాపాడారు. మరోచోట వరదలో ఓ ద్విచక్రవాహనం కొట్టుకుపోతుండగా.. యజమాని అతి కష్టం మీద ఆ బండిని కాపాడుకున్నాడు.    

ఇదీ చూడండి: Tollywood drugs case: ముగిసిన నటి చార్మి విచారణ.. 6 గంటలు సాగిన ప్రశ్నల వర్షం

Last Updated : Sep 2, 2021, 10:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.