ఇవాళ ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాలో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. గురువారం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడుతాయని ఐఎండీ కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. రాగల మూడు రోజులు తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలుంటాయని పేర్కొన్నారు.
రాష్ట్రంలో కిందిస్థాయిలో గాలులు... పశ్చిమ వాయువ్య దిశల నుంచి వీస్తున్నాయన్నారు. మంగళవారం ఉత్తర బంగళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ఇవాళ బలహీనపడిందని ఐఎండీ సంచాలకులు తెలిపారు. ఈ రోజు ఉపరితల ద్రోణి నైరుతి... ఉత్తర ప్రదేశ్ నుంచి ఝార్ఖండ్ మీదుగా దక్షిణ ఛత్తీస్‌గడ్ వరకు... సముద్రమట్టానికి 3.1 కిలోమీటర్ల నుంచి 5.8కిలోమీటర్ల వరకు వ్యాపించి ఉందని సంచాలకులు వివరించారు.
ఇదీ చూడండి: ప్రైవేట్ ఆస్పత్రుల్లో కరోనా చికిత్స ధరలు ఇవే..