ETV Bharat / state

రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు... స్తంభించిన జనజీవనం - Heavy rains in Telangana

బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్రవాయుగుండం ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వానకు లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా... జనజీవనం స్తంభించింది. జిల్లాల్లో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలకు పలుచోట్ల పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వాతావరణశాఖ హెచ్చరికలతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది..

రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు... స్తంభించిన జనజీవనం

author img

By

Published : Oct 13, 2020, 6:10 PM IST

ఉమ్మడి ఖమ్మం జిల్లావ్యాప్తంగా వర్షం బీభత్సం సృష్టించింది. రాత్రి నుంచి జోరుగా కురుస్తున్న వానలతో జనజీవనం అతలాకుతలమైంది. జిల్లావ్యాప్తంగా వందలాది ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. వైరా, సత్తుపల్లి పరిధిలోని గ్రామాల్లో కుండపోత వానతో... పలుఇళ్లు కూలిపోయాయి. పంట పొలాలు నీట మునిగాయి. వరదలో చిక్కుకున్న వస్తువులను కాపాడుకునేందుకు ప్రజలు నానాఅవస్థలు పడ్డారు.

నీటిపాలైన బతుకమ్మ చీరలు...

తల్లాడ మండలం కుర్నవల్లి ఉన్నత పాఠశాల జలమయమైంది. పాఠశాలలో నిల్వ చేసిన బతకమ్మ చీరలు, రేషన్‌ బియ్యం నీటి పాలయ్యాయి. తల్లాడలో ఇళ్లు కూలిన ఘటనలో 20 గొర్రెలు, మేకలు మృత్యువాత పడ్డాయి. అశ్వారావుపేట, దమ్మపేట, ముల్కలపల్లిలో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలిగింది.

బొగ్గు ఉత్పత్తికి అంతరాయం...

ముల్కలపల్లి మండలం పొగుళ్లపల్లి వద్ద వాగు ఉద్ధృతికి ఓ ద్విచక్రవాహనం కొట్టుకుపోయింది. వాగులో కొట్టుకుతున్న వ్యక్తిని స్థానికులు కాపాడారు. ముల్కలపల్లి మండలం నరసాపురం, తోగూడెం గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఇల్లెందు, కోయగూడెం ఉపరితల గనుల్లో పనులు నిలిచిపోయాయి. కిష్టారం గనుల్లో 25 వేల మెట్రిక్‌ టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది.

రోగులు అవస్థలు...

మధిరలో కుండపోత వర్షానికి ఇళ్లలోకి వరదనీరు చేరింది. మధిర ప్రభుత్వ ఆస్పత్రిలోకి మోకాలి లోతు వరద నీరు చేరింది. ప్రసూతి వార్డులోకి కూడా పెద్ద ఎత్తున నీరు చేరగా బాలింతలు, చిన్నారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఇప్పటికే శిథిలావస్థకు చేరిన ఆస్పత్రి భవనంలో... ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి రోగులు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు.

ఉమ్మడి వరంగల్ వ్యాప్తంగా...

ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా పల్లెలు, పట్టణాలు తడిసి ముద్దవుతున్నాయి. వరంగల్, కాజీపేట, హన్మకొండ ప్రాంతాల్లో ఉదయం మోస్తరుగా కురిసినా... ఆ తరువాత జోరందుకుంది. రహదారులు జలమయమయ్యాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మహబూబాబాద్ జిల్లా గూడురు, కొత్తగూడ, గంగారం, బయ్యారం, గార్ల మండలాల్లో ఎడతెరిపిలేకుండా వర్షం కురిసింది.

వరంగల్ గ్రామీణ జిల్లా, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోనూ ఎడతెరపిలేని వానలతో... జనజీవనం స్తంభించింది. సూర్యాపేట జిల్లా దొండపాడులో ఎర్ర వాగు పొంగగా... రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వాగు ఉద్ధృతికి పంటలు పెద్ద ఎత్తున దెబ్బతిన్నాయి.

ఇదీ చూడండి: వాయుగుండం ప్రభావంతో భాగ్యనగరంలో భారీ వర్షాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.