సికింద్రాబాద్‌లోని బోయిన్పల్లి, అల్వాల్, సుచిత్ర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఆర్పీ రోడ్డు పూర్తిగా జలమయమైంది. వర్షపు నీరు చేరడం వల్ల వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లోతుకుంట ఎంసీఎంఈ సిగ్నల్ వద్ద వృక్షం కూలడం వల్ల ట్రాఫిక్ జామ్ అయింది. ఈ వర్షానికి అల్వాల్, లోతుకుంట, భూదేవి నగర్, జనరల్ బజార్ లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. అల్వాల్‌లోని పలు కాలనీలోకి నీరు రావడం వల్ల కాలనీ వాసులు బయటకు రాలేని పరిస్థితి నెలకొంది.
భూదేవి నగర్ వద్ద ఉన్న ఇళ్లలోకి నీరు చేరడం వల్ల స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సరైన డ్రైనేజీ వ్యవస్థ లేక నీరు ఎక్కడికక్కడ నిలిచి ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. జీహెచ్ఎంసీ అధికారులు చొరవ తీసుకుని పరిస్థితిని చక్కదిద్దాలని ప్రజలు కోరుతున్నారు.
ఇదీ చూడండి : "తెలంగాణలో నిర్భంధ పాలన సాగుతోంది"