ETV Bharat / state

అన్​లాక్​ ఎఫెక్ట్: కిక్కిరిసిన ముషీరాబాద్ చేపల మార్కెట్ - తెలంగాణ వార్తలు

ఓవైపు లాక్​డౌన్ ఎత్తివేయడం, మరోవైపు ఆదివారం కావడంతో ముషీరాబాద్ చేపల మార్కెట్​ కిక్కిరిసిపోయింది. ఇతర రాష్ట్రాల నుంచి చేపలు దిగుమతి అయినా ధరలు ఏమాత్రం తగ్గలేదని వినియోగదారులు వాపోయారు. కాగా మార్కెట్​లో కొందరు కరోనా నిబంధనలు గాలికొదిలేశారు. కనీసం మాస్క్ ధరించకుండానే విక్రయాలు జరుపుతున్నారు.

fish market, musheerabad market
ముషీరాబాద్ చేపల మార్కెట్, కరోనా నిబంధనలు బేఖాతరు
author img

By

Published : Jun 20, 2021, 11:42 AM IST

రాష్ట్రంలో లాక్​డౌన్​ పూర్తిగా ఎత్తివేసినట్లు ప్రభుత్వం ప్రకటించడంతో హైదరాబాద్​లోని ముషీరాబాద్ చేపల మార్కెట్ మరింత కిక్కిరిసింది. వ్యాపారులు, కొనుగోలుదారులతో మార్కెట్ ఆదివారం కిటకిటలాడింది. వ్యాధి నిరోధక శక్తి పెరగడం కోసం చేపలు తినాలనే భావనతో ప్రజలు ఆసక్తి కనబర్చుతున్నారు. అదే అదునుగా భావించిన అమ్మకందారులు ఇష్టానుసారంగా ధరలు పెంచి విక్రయిస్తున్నారని వినియోగదారులు వాపోయారు.

తగ్గని ధరలు

ప్రధానంగా లాక్​డౌన్ కారణంగా కొన్ని రోజులుగా చేపల దిగుమతి పూర్తిగా తగ్గింది. ఆ సమయంలో చేపల ధరలు విపరీతంగా పెరిగాయి. కాగా ఈ వారం వంద లారీల చేపలు అదనంగా పొరుగు రాష్ట్రాల నుంచి దిగుమతి అయ్యాయి. అయినప్పటికీ ధరలు ఏమాత్రం తగ్గలేదు. లాక్​డౌన్ సమయంలో కొర్రమీను రూ.350 కేజీ ఉండగా, నేడు రూ.500 పలికింది. ఎక్కువగా విక్రయించే బొచ్చ, రవ్వు, ఇతర సాధారణ చేపల ధరలూ పెరిగాయి.

నిబంధనలు బేఖాతరు

ముషీరాబాద్ చేపల మార్కెట్​లోని హోల్ సేల్ అమ్మకందారుల్లో వ్యాపారం స్వేచ్ఛగా సాగుతోంది. అక్కడి నుంచి నగరంలోని అనేక ప్రాంతాలకు పెద్దఎత్తున చేపల సరఫరా జరుగుతోంది. మార్కెట్​లో కరోనా నిబంధనలు గాలికొదిలేశారు. లాక్​డౌన్ ఎత్తివేయడంతో అటు వ్యాపారులు, కొనుగోలుదారులు మాస్కులు ధరించకపోవడం ఆందోళన కలిగిస్తోంది.

ఇదీ చదవండి: SCHOOLS OPEN: జులై 1 నుంచి విద్యాసంస్థలు ప్రారంభం.. సోమవారం విధివిధానాలు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.