ETV Bharat / state

Heart attack deaths in early age : చిన్న వయస్సులోనే లయ తప్పుతున్న గుండె... - Causes of heart failure

Heart attack cases in Telangana : హార్ట్ ఎటాక్ ఇప్పుడు సమాజంలో ఒక ఆందోళనకరమైన పరిస్థితిని కలిగిస్తున్న పెద్ద సమస్యగా మారింది. హార్ట్ ఎటాక్ ఎప్పుడు వస్తుందో? ఎవరికి వస్తుందో? ఎందుకు వస్తుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఎంతో ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు, చిన్న చిన్న పిల్లలు సైతం హార్ట్ ఎటాక్ బారినపడి మృతి చెందుతున్న ఘటనలు అనేకం కనిపిస్తున్నాయి.

Heart attack deaths
Heart attack deaths
author img

By

Published : Jul 31, 2023, 5:23 PM IST

Updated : Jul 31, 2023, 5:49 PM IST

Heart attack deaths in Telangana : ప్రస్తుత పరిస్థితులలో వయస్సుతో సంబంధం లేకుండా గుండెపోటుకు గురవుతున్నారు. ఎప్పుడూ ఆరోగ్యంతో సంతోషంగా ఉన్నవారు సైతం హార్ట్ ఎటాక్ బారిన పడి మృతి చెందటం ఆందోళన కలిగిస్తుంది. తాజాగా భాగ్యనగరంలో ఇలాంటి విషాద ఘటన జరిగింది. హైదరాబాద్‌లోని పేట్‌బషీరాబాద్‌లో గుండెపోటుతో ఓ విద్యార్థి మృతి చెందాడు. గత కొంతకాలంగా గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్న కుశాల్‌.. హాస్టల్‌లో గదిలో హార్ట్‌ఎటాక్‌తో మరణించాడు.

Heart issues in youth : పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పేట్‌బషీరాబాద్‌ పీఎస్‌ పరిధిలోని మైసమ్మగూడలో కుశాల్‌ ఉంటున్నాడు. అక్కడ హాస్టల్‌లో ఉంటూ ఎంబీఏ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఆదివారం రాత్రి బాత్‌రూంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. కాలకృత్యాలు తీర్చుకునే సమయంలో గుండె నొప్పి రావడంతో కుశాల్‌ మరణించి ఉండొచ్చని పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసిన దర్యాప్తు చేపట్టారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ అస్పత్రికి తరలించారు.

Heart failure cases : రంగారెడ్డి జిల్లాలోనూ ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. అనుమానాస్పద స్థితిలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ బాత్‌రూంలో మృతిచెందిన సంఘటన రంగారెడ్డి జిల్లా పుప్పాలగూడలోని అల్కాపూర్‌ కాలనీలో ఆదివారం వెలుగు చూసింది. నార్సింగి పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం.. వరంగల్‌కు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ త్రిపురాది మణిరాజ్‌(30) పాస్‌పోర్టు తీసుకోవడానికి.. తన తండ్రి నవీన్‌కుమార్‌తో కలిసి ఈ నెల 28న హైదరాబాద్ నగరానికి వచ్చాడు. అదేరోజు సాయంత్రం కుమారుడిని ఉప్పల్‌ మెట్రో స్టేషన్‌ వద్ద వదిలిపెట్టి తండ్రి వరంగల్‌కు వెళ్లాడు.

Rare heart surgery: హార్ట్‌ ఫెయిల్‌.. అరుదైన చికిత్సతో ప్రాణం పోసిన ఏఐజీ వైద్యులు

Latest heart related deaths : మణిరాజ్‌ తన పనులు ముగించకుని.. సాయంత్రానికి అల్కాపూర్‌లో నివసించే తన స్నేహితుడు చాణక్య ఇంటికి వెళ్లాడు. మరుసటిరోజు అతడు.. ఇతర మిత్రులతో కలిసి వెస్ట్‌మారేడ్‌పల్లిలోని గణేశ్‌ ఆలయం, జుబ్లీహిల్స్‌లోని పెద్దమ్మ దేవాలయాన్ని సందర్శించాడు. అనంతరం జుబ్లీహిల్స్‌లోని ఓ పబ్‌కు వెళ్లాడు. అక్కడి నుంచి స్నేహితులంతా వెళ్లిపోగా, మణిరాజ్‌ తిరిగి చాణక్య ఇంటికి చేరుకున్నాడు.

ఆదివారం ఉదయం చాణక్య అపార్టుమెంట్‌లో జరిగే మీటింగ్‌కు వెళ్లే సమయంలో.. మణిరాజ్ స్నానం గదిలో ఉన్నాడు. 11.30 గంటలకు తిరిగి వచ్చిన చాణక్య.. బాత్‌రూం తలుపు కొట్టగా ఏటువంటి స్పందన రాలేదు. చుట్టూపక్కల వారిని పిలిచి తలుపు బద్దలుకొట్టి చూడగా.. మణిరాజ్‌అప్పటికే మృతి చెందాడు . వెంటనే ఈ విషయాన్ని మణిరాజ్‌ తండ్రికి ఫోన్‌చేసి చెప్పగా.. తండ్రి నవీన్‌కుమార్‌ నగరానికి వచ్చాడు. తండ్రి ఫిర్యాదుతో నార్సింగి పోలీసులు కేసు నమోదు చేశారు.

గుండె లయ తప్పుతోందా? ఎలా కాపాడుకోవాలి..?

Causes of heart failure: హార్ట్ ఫెయిల్యూర్ అనేది రెండు కారణాల వల్ల జరగవచ్చని వైద్యులు చెబుతున్నారు. గుండె చుట్టూ ఉంటే రక్తనాళాల్లో ఏర్పడే ఆటంకం వల్ల హార్ట్ ఫెయిల్యూర్ కావచ్చు అని వైద్యులు వివరిస్తున్నారు. అనుమానం ఉంటే ముందుగానే వైద్య పరీక్షలు నిర్వహించి ఎక్కడ బ్లాక్ అయిందో గుర్తించి, చికిత్స చేయించుకోవాలని డాక్టర్లు చెబుతున్నారు. ఇన్‎ఫెక్షన్స్, సిస్టమేటిక్ కనెక్టివ్ టిష్యూ డిసీజ్‎ల వల్ల కూడా గుండెపోటు కావడానికి అవకాశం ఉంటుందని కార్డియాలజిస్ట్​లు చెబుతున్నారు. ఈ రకమైన ఫెయిల్యూర్ అకస్మాత్తుగా వచ్చేది కాదని, అనారోగ్య కారణం, నిర్లక్ష్యం, శరీరానికి తగిన శ్రమ లేకపోవడం, ధూమపానం, మద్యపానం లాంటి అనేక కారణాలు ఉండవచ్చని వారు చెబుతున్నాారు.

ఇవీ చదవండి :

షటిల్​ ఆడుతూ గుండెపోటుతో వ్యక్తి మృతి.. వీడియో వైరల్

'హార్ట్ ఫెయిల్యూర్' ఎందుకు అవుతుంది?.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

గుండెపోటుకు ముందు వచ్చే సంకేతాలేంటో తెలుసా..? వాటిని ఎలా గుర్తించాలి

Last Updated : Jul 31, 2023, 5:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.