కరోనా వైరస్ పట్ల ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని.... వైద్యఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఇప్పటివరకు ఒక్క కేసు కూడా నమోదుకాలేదన్న మంత్రి.... ప్రభుత్వ పరంగా ముందస్తు జాగ్రత్తలు చేపట్టామన్నారు.
ప్రజలకు నాణ్యమైన వైద్య సదుపాయాలు కల్పించేందుకు వైద్యశాఖ కృషి చేస్తోందన్నారు. కరోనాకు సంబంధించి ఎలాంటి పరిస్థితి ఏర్పడినా... ఒక్క ప్రాణం కూడా పోకుండా జాగ్రత్తలు తీసుకున్నామంటున్న మంత్రి ఈటల రాజేందర్‌తో ఈటీవీ భారత్ ప్రతినిధి ముఖాముఖి.