పేదల పక్షపాతిగా వైద్యులు సేవలందించాలని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ సూచించారు. కరోనా సమయంలో భారత వైద్య రంగంపై ఎన్నో విమర్శలొచ్చాయని.. మందు లేకున్నా.. ధైర్యంతో కరోనాను ఎదుర్కొనేలా చేశామని పేర్కొన్నారు. కజాక్ నేషనల్ మెడికల్ యూనివర్సిటీ నుంచి పట్టభద్రులైన మెడికల్ విద్యార్థులకు బేగంపేటలోని హరితప్లాజాలో డిగ్రీ పట్టాలను ప్రదానం చేశారు.
కరోనాకి.. అమెరికా లాంటి దేశాలే వణికిపోయాయన్నారు. కానీ.. మనం ధైర్యంగా ఎదురు నిలబడి ఎదుర్కున్నామని పేర్కొన్నారు. తమ ప్రాణాలని పణంగా పెట్టి... వైద్యం అందిస్తున్న వైద్యులను మంత్రి అభినందించారు. నియో ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ సంస్థ గత పాతికేళ్లకు పైగా విదేశి వైద్య విద్యా రంగంలో ఉందని ఆ ఇనిస్టిట్యూట్ సీఈవో రాజు అన్నారు. రష్యా, చైనా, ఉక్రెయిన్, కజకిస్థాన్, జర్మని లాంటి అనేక దేశాలకు చెందిన ప్రసిద్ధ ప్రభుత్వ మెడికల్ యూనివర్సిటీలకు సంబంధించిన సమాచారాన్ని పారదర్శకంగా అందిస్తూ.. డాక్టర్ కావాలన్న వారి కలలను సాకారం చేస్తోందని తెలిపారు.
ఇదీ చదవండి: 'ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు చేశాం'