ETV Bharat / state

'కేసీఆర్​ పనితీరుకు అల్లర్లు లేని హైదరాబాదే నిదర్శనం' - జీహెచ్​ఎంసీ ఎన్నికలు-2020

హైదరాబాద్​ను అభివృద్ధి చేసిన ఘనత తెరాసకే దక్కుతుందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్​ అన్నారు. సికింద్రాబాద్​లోని​ అల్వాల్, మచ్చ బొల్లారం, వెంకటాపురం డివిజన్లకు చెందిన తెరాస అభ్యర్థులు విజయ శాంతి, జితేంద్రనాథ్, సబితా నామినేషన్ దాఖలు కార్యక్రమంలో పాల్గొన్నారు.

health minister eetala rajender participated in nomination filling event in hyderabad
హైదరాబాద్​ను అభివృద్ధి చేసిన ఘనత తెరాసదే: ఈటల
author img

By

Published : Nov 19, 2020, 3:59 PM IST

మత కల్లోలాలు లేని హైదరాబాద్ నగరాన్ని తీర్చిదిద్దిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్​కు దక్కుతుందని ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. సికింద్రాబాద్​లోని​ అల్వాల్, మచ్చ బొల్లారం, వెంకటాపురం డివిజన్లకు చెందిన తెరాస అభ్యర్థులు విజయ శాంతి, జితేంద్రనాథ్, సబితా నామినేషన్ దాఖలు కార్యక్రమంలో పాల్గొన్నారు. గత మున్సిపల్ ఎన్నికల్లో 99 సీట్లు గెలిచామని.. ప్రస్తుత ఎన్నికల్లో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.

నగరంలో వందల కోట్ల రూపాయలతో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు. హైదరాబాద్​ను ఐటీ హబ్​గా తీర్చిదిద్దిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కిందన్నారు. నగరంలో తాగునీటి సమస్యతో పాటు అనేక సమస్యలు తీర్చినట్లు తెలిపారు. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు నగరంలో జరిగిన అభివృద్ధి తెరాస గెలుపునకు దోహదపడతాయన్నారు.

ఇదీ చదవండి: గ్రేటర్‌ ఎన్నికల్లో తెరాస అభ్యర్థుల రెండో జాబితా విడుదల

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.