హైదరాబాద్ చాంద్రాయణగుట్టలోని ఓ హోటల్లో పూరి అడిగితే కాగిన నూనె ఒంటిపై పోశాడు. హాశమాబాద్కు చెందిన మహమ్మద్ బాషాది వెల్డింగ్ షాప్ నిర్వహిస్తున్నాడు. షాప్‌కు సమీపంలోని హారమైన్ హోటల్‌కు అల్పహారం కోసం పూరి అడిగాడు. 15 నిమిషాల సమయం పడుతుందని హోటల్ సిబ్బంది చెప్పారు. మరో పదిహేను నిమిషాలు వేచి చూసి అడగిన బాషాదికి.. సిబ్బంది మరో 15 నిమిషాల అదనపు సమయం పడుతుందని తెలుపగా వారితో వాగ్వాదానికి దిగాడు. గమనించిన స్థానికులు సముదాయించి పంపించేశారు.
మొహమ్మద్ బాషాది ఇంటికి వెళ్లి తమ్ముడు అబ్దుల్లా బాషాది చెప్పి ఇద్దరు కలిసి హోటల్‌కు వచ్చి కుక్‌ను అడిగారు. కూరగాయల కత్తి చూపిస్తూ పక్కనే కాగి ఉన్న నూనెను మొహమ్మద్ బాషాదిపై చల్లాడు. బాధితుడిని హుటాహుటిన ప్రైవేట్ ఆస్పత్రికి తరలించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
ఇవీ చూడండి : బంజారాహిల్స్ కాలనీ వాసుల ధర్నా