ETV Bharat / state

వైద్య రంగంలో తెలంగాణ అగ్రగామి: మంత్రి హరీశ్​రావు - మెడికోవర్ ఆసుపత్రి తాజా వార్తలు

Harish Rao on Medical Services in Telangana : డయాలసిస్ సేవలు అందించడంలో తెలంగాణ ఛాంపియన్ అని మంత్రి హరీశ్​రావు పేర్కొన్నారు. డయాలసిస్ చికిత్స కోసం ఇప్పటివరకు రూ.700 కోట్లు ఖర్చు చేశామని చెప్పారు. కిడ్నీ సంబంధిత వ్యాధులు రాకుండా.. శుద్ధి చేసిన ఉపరితల తాగు నీటిని అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని హరీశ్​రావు వెల్లడించారు.

Harish Rao
Harish Rao
author img

By

Published : Dec 17, 2022, 12:51 PM IST

డయాలసిస్ సేవలు అందించడంలో తెలంగాణ ఛాంపియన్: హరీశ్​రావు

Harish Rao on Medical Services in Telangana : రాష్ట్రంలో వ్యాధులు వచ్చిన తర్వాత మెరుగైన చికిత్స అందించడంతో పాటు.. వ్యాధులు రాకుండా అవసరమైన చర్యలు చేపడుతున్నామని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్​రావు తెలిపారు. మారుతున్న సాంకేతికత అందిపుచ్చుకునేలా వస్క్యులర్ సర్జరీ సింపోజియం నిర్వహించడం గొప్ప విషయమని అన్నారు. వైద్యులు నిత్య విద్యార్థులు.. రోజు రోజుకు ఎంతో సాంకేతికత పెరుగుతుందని తెలిపారు. ప్రముఖ కిడ్నీ స్పెషలిస్ట్ దామోదర్ రెడ్డి కుంబాల ఆధ్వర్యంలో నైపుణ్యాలు పెంచుతున్నారని కొనియాడారు. నిమ్స్ ఆసుపత్రిలో దాదాపు రూ.2 కోట్లతో ఏర్పాటు చేసిన ఇంట్రా ఆపరేటివ్‌ ఆల్ట్రా సౌండ్‌, ఇంట్రా ఆపరేటివ్‌ న్యూరో మానిటరింగ్, అల్ట్రా సోనిక్‌ ఆస్పిరేట్ వైద్య పరికరాలను హరీశ్​రావు ప్రారంభించారు.

తెలంగాణ ఛాంపియన్: డయాలసిస్ సేవలు అందించడంలో తెలంగాణ ఛాంపియన్ అని హరీశ్​రావు అన్నారు. డయాలసిస్ చికిత్స కోసం ఇప్పటివరకు రూ.700 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. ఏటా రూ.100 కోట్ల వరకు వ్యయం చేస్తున్నట్లు చెప్పారు. 10,000 మందికి డయాలసిస్ చేస్తున్నామని పేర్కొన్నారు. వారికి బస్ పాస్, పింఛన్లు.. జీవిత కాల మందులు ఉచితంగా అందిస్తున్నట్లు హరీశ్​రావు వివరించారు.

శుద్ధి చేసిన ఉపరితల తాగునీటిని అందిస్తున్నాం: కిడ్నీ సంబంధిత వ్యాధులు రాకుండా.. శుద్ధి చేసిన ఉపరితల తాగునీటిని అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని హరీశ్​రావు పేర్కొన్నారు. ప్రాథమిక దశలోనే గుర్తించి వ్యాధులు రాకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. జీవన్​దాన్​లో అవయవ దానం వెయిటింగ్ లిస్ట్ ఎక్కువగా ఉందని.. అందరం కలిసి అవయవదానాన్ని ప్రోత్సహించాలని హరీశ్​రావు పిలుపు నిచ్చారు.

"చిన్న వయస్సులో వ్యాధులు పెరిగిపోయాయి. వాటిని ప్రాథమిక దశలో గుర్తించడం.. వారికి అవసరమైన మందులు అందించి వాడుకునే విధంగా చేస్తున్నాం. ఒకవేళ అలా వాడకపోతే శరీర అవయవాల మీద ప్రభావం చూపుతుంది. దీనిని తెలంగాణ ప్రభుత్వం గుర్తించి రెండోసారి ఎన్​సీడీ చేపడుతున్నాం. అలాంటి వారికి నెలరోజులు సరిపడా మందులు ఇస్తున్నాం. ప్రాథమిక దశలోనే గుర్తించి వ్యాధులు రాకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నాం." -హరీశ్​రావు, వైద్యారోగ్యశాఖ మంత్రి

అంతకుముందు బేగంపేటలోని మెడికోవర్ ఆసుపత్రిని మంత్రులు హరీశ్​రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. వైద్య రంగంలో తెలంగాణ అగ్రగామిగా నిలిచిందని హరీశ్​రావు చెప్పారు. ప్రతి జిల్లాలో ఒక వైద్య కళాశాలతో.. పెద్ద ఎత్తున వైద్యులు వస్తారని తెలిపారు. రాష్ట్రంలో ఎంబీబీఎస్ సీట్లు నాలుగు వంతులు పెంచామని గుర్తు చేశారు. మెడికల్ హబ్‌గా తెలంగాణ ఎదిగిందని.. అత్యధిక ట్రాన్స్‌ప్లాంట్ జరిగేది హైదరాబాద్‌లోనే అని పేర్కొన్నారు. ఆరోగ్యశ్రీ కింద ప్రైవేట్ ఆసుపత్రులు మంచి వైద్యం అందించాలని సూచించారు. ఆరోగ్యశ్రీ కింద అత్యధికంగా రూ.10 లక్షల వరకు ఇస్తున్నామని వెల్లడించారు. ఆరోగ్యశ్రీ కింద రూ.1000 కోట్లు పేద ప్రజల వైద్యం కోసం ఖర్చు చేస్తున్నామని వివరించారు.

ఇవీ చదవండి: రాష్ట్రంలో మొబిలిటీ వ్యాలీ.. జీనోమ్‌ వ్యాలీ తరహాలో ఏర్పాటుకు సర్కారు సన్నాహాలు

రూ.5 కుర్​కురే ప్యాకెట్​లో రూ.500 నోట్లు.. దుకాణాల వద్ద గ్రామస్థుల క్యూ..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.