ETV Bharat / state

HarishRao on Congress : 'కాంగ్రెస్‌కు తెలంగాణ ప్రజలు త్వరలోనే తగిన బుద్ధి చెప్తారు'

HarishRao Comments on Congress : కాంగ్రెస్‌ విధానాలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. ఉచిత విద్యుత్‌ వద్దని అన్నవాళ్లకు ప్రజలు రాజకీయంగా సమాధి కట్టారని.. కాంగ్రెస్‌కు కూడా తెలంగాణ ప్రజలు త్వరలోనే తగిన బుద్ధి చెప్తారని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ అని చెప్తున్న యూపీ, మహారాష్ట్రలో ఆయిల్‌ ఇంజిన్లు ఉన్నాయని హరీశ్‌రావు విమర్శించారు.

Harish Rao
Harish Rao
author img

By

Published : Jul 14, 2023, 7:18 PM IST

Updated : Jul 14, 2023, 7:24 PM IST

HarishRao Fires on RevanthReddy : కాంగ్రెస్‌ తన నిజ స్వరూపాన్ని బయట పెట్టుకుందని మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. రైతుల పట్ల హస్తం పార్టీ విధానం ఏమిటో తెలిసిపోయిందని విమర్శించారు. సాగుకు 3 గంటల విద్యుత్‌ చాలని రేవంత్‌రెడ్డి అన్నారని.. ఈ క్రమంలోనే 8 గంటల కరెంట్ చాలు అని మరో కాంగ్రెస్‌ నేత పేర్కొన్నారని దుయ్యబట్టారు. కానీ ఉచిత విద్యుత్‌కు వ్యతిరేకమని సోనియాగాంధీ మాట్లాడారని దుయ్యబట్టారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

సాగుకు 7 గంటలకు మించి ఇవ్వలేమని ఆనాడు వైఎస్‌ అన్నారని హరీశ్‌రావు గుర్తుచేశారు. తెలంగాణ ఉద్యమానికి గల కారణాలలో విద్యుత్‌ కూడా ఒకటి అని పేర్కొన్నారు. బషీర్‌బాగ్‌ కాల్పుల ఘటనను కేసీఆర్‌ గతంలోనే వ్యతిరేకించారని చెప్పారు. ఈ క్రమంలోనే వెంటనే విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని చంద్రబాబుకు లేఖ రాశారని వివరించారు. కేసీఆర్ డిప్యూటీ స్పీకర్‌గా ఉన్నప్పటికి.. చంద్రబాబును హెచ్చరించారని హరీశ్‌రావు వెల్లడించారు.

HarishRao Comments on Congress : విద్యుత్‌, తెలంగాణ కోసం పదవులు వదులుకున్న నాయకుడు కేసీఆర్‌ అని హరీశ్‌రావు తెలిపారు. పదవుల కోసం చొక్కాలు మార్చినట్లు పార్టీలు మారేవారు మీరని హస్తం నేతలను ఉద్దేశించి విమర్శించారు. రైతులకు 24 గంటల నిరంతర విద్యుత్‌ ఇవ్వడం లేదని కాంగ్రెస్‌ నాయకులు మాట్లాడుతున్నారని.. లాగ్‌ బుక్కులు.. పేపర్లు అంటూ ఏవేవో అంటున్నారని హరీశ్‌రావు వివరించారు.

HarishRao on Congress : ఇదంతా ఎందుకు కాంగ్రెస్‌ నేతలు.. నేరుగా వెళ్లి కరెంట్ తీగలను పట్టుకోండని హరీశ్‌రావు పేర్కొన్నారు. అప్పుడు నిరంతరం విద్యుత్‌ వస్తుందో.. లేదో తెలిసిపోతుందని చెప్పారు. ఈ క్రమంలోనే హస్తం పార్టీ విధానాలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఉచిత విద్యుత్‌ వద్దని అన్నవాళ్లకు ప్రజలు రాజకీయంగా సమాధి కట్టారని.. కాంగ్రెస్‌కి కూడా తెలంగాణ ప్రజలు త్వరలోనే తగిన బుద్ధి చెప్తారని వివరించారు. ఉచిత కరెంట్‌ను ఆ పార్టీ నాయకులు వ్యాపార కోణంలో చూస్తున్నారని మండిపడ్డారు. ఈ క్రమంలోనే డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ అని చెప్తున్న యూపీ, మహారాష్ట్రలో ఆయిల్‌ ఇంజిన్లు ఉన్నాయని హరీశ్‌రావు ఆరోపించారు.

"కాంగ్రెస్‌ తన నిజ స్వరూపాన్ని బయటపెట్టుకుంది. రైతుల పట్ల కాంగ్రెస్‌ విధానం ఏమిటో తెలిసిపోయింది. సాగుకు 3 గంటల విద్యుత్‌ చాలని రేవంత్‌రెడ్డి అన్నారు. 8 గంటల విద్యుత్‌ చాలు అని మరో కాంగ్రెస్‌ నేత అన్నారు. ఉచిత విద్యుత్‌కు వ్యతిరేకమని సోనియాగాంధీ అన్నారు. సాగుకు 7 గంటలకు మించి ఇవ్వలేమని ఆనాడు వైఎస్‌ అన్నారు. తెలంగాణ ఉద్యమానికి కారణాలలో విద్యుత్‌ కూడా ఒకటి. ఉచిత విద్యుత్‌ వద్దని అన్నవాళ్లకు ప్రజలు రాజకీయంగా సమాధి కట్టారు." - హరీశ్‌రావు, మంత్రి

కాంగ్రెస్‌ విధానాలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు

ఇవీ చదవండి: BRS Protest aganist Revanth Reddy : 'రేవంత్​రెడ్డి క్షమాపణలు చెప్పేవరకూ నిరసనలు ఆగవు'

BRS on Congress Comments : 'రైతుల శత్రువు కాంగ్రెస్.. ఫ్రీ కరెంట్​పై ఆ పార్టీది దుర్మార్గపు ఆలోచన'

Last Updated : Jul 14, 2023, 7:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.