ETV Bharat / state

TS Bankers Samithi Meeting in T-HUB : ఈ ఏడాది వార్షిక రుణ లక్ష్యం రూ.2,42,775 కోట్లు - టీహబ్‌లో తెలంగాణ బ్యాంకర్ల సమితి సమావేశం

TS Bankers Samithi Meeting in T-HUB : ఈ ఏడాది వార్షిక రుణ లక్ష్యాన్ని బ్యాంకులు రూ.2 లక్షల కోట్లుగా నిర్ధారించడం సంతోషంగా ఉందని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌ రావు పేర్కొన్నారు. దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న తెలంగాణలో వంద శాతం జిల్లాలు డిజిటల్‌ జిల్లాలుగా గుర్తింపు పొందడం గొప్ప విషయమని హర్షం వ్యక్తం చేశారు. టీ-హబ్‌లో జరిగిన రాష్ట్ర బ్యాంకర్ల సమితి సమావేశంలో హరీశ్‌ రావుతో పాటు మంత్రి నిరంజన్‌ రెడ్డి పాల్గొన్నారు.

Harish Rao
Harish Rao
author img

By

Published : May 19, 2023, 5:00 PM IST

Telangana Bankers Samithi Meeting : రాష్ట్రంలోని వంద శాతం జిల్లాలు డిజిటల్‌ జిల్లాలుగా గుర్తింపు పొందడం గొప్ప విషయమని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌ రావు హర్షం వ్యక్తం చేశారు. ఈ ఏడాది వార్షిక రుణ లక్ష్యాన్ని బ్యాంకులు రూ.2,42,775 కోట్లుగా నిర్ధారించడం సంతోషంగా ఉందని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని టీ-హబ్‌లో జరిగిన రాష్ట్ర బ్యాంకర్ల సమితి సమావేశంలో హరీశ్‌ రావుతో పాటు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌ రెడ్డి, బ్యాంకు అధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌ రావు మాట్లాడుతూ.. దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంగా తెలంగాణ నిలుస్తోందని హర్షం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్‌ మార్గనిర్దేశంలో తెలంగాణ.. అనతి కాలంలోనే దేశానికే మార్గదర్శిగా నిలిచిందని కొనియాడారు. పెట్టుబడుల ఆకర్షణ, ఉద్యోగ కల్పనలో అగ్రస్థానంలో నిలుస్తూ.. వ్యవసాయం, అనుబంధ రంగాల్లో గణనీయమైన వృద్ధిని సాధించామని వివరించారు.

ఈ ఏడాది నిర్ణయించిన రూ.2,42,775 కోట్ల వార్షిక రుణ లక్ష్యాన్ని అన్ని బ్యాంకులు చేరుకోవాలని మంత్రి హరీశ్​రావు సూచించారు. విద్య, గృహ, వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ రంగాలకు బ్యాంకులు ఎక్కువగా రుణాలు ఇవ్వాలని కోరారు. అలాగే ఆయిల్‌ ఫామ్ విస్తరణకు కూడా బ్యాంకులు తోడ్పాటు అందించాలని విజ్ఞప్తి చేశారు. ఎంఎస్‌ఎంఈలకు ఎక్కువ రుణాలు ఇవ్వాలని.. చిరు వ్యాపారులకు భరోసా ఇవ్వాలన్నారు. ఎస్‌హెచ్‌జీలకు ఆర్‌బీఐ నిబంధనల మేరకే వడ్డీలు వసూలు చేయాలని బ్యాంకు అధికారులకు తెలిపారు. అయితే దేశంలోనే డిపాజిట్లలో అగ్రస్థానంలో రాష్ట్రం ఉన్నందున.. ఇక్కడ బ్యాంకుల శాఖలను కూడా పెంచితే బాగుంటుందని మంత్రి హరీశ్‌ రావు అభిప్రాయపడ్డారు.

రాష్ట్రంలో ఏఏ విభాగాలకు ఎంత వాటా కేటాయింపు..: ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలో వార్షిక రుణ లక్ష్యం రూ.2,42,775 కోట్లుగా బ్యాంకులు నిర్ధారించాయి. అదే గత ఏడాదైతే లక్ష్యం రూ.2.14 లక్షల కోట్లుగానే ఉంది. అంటే గతేడాది కంటే ఈసారి 13.42 శాతం అధికంగా పెంచారు. ఈ ఏడాది రుణ లక్ష్యంలో ప్రాధాన్యతా రంగం వాటా రూ.1,85,326.68 కోట్లుగా నిర్ణయించారు. దీని వాటా 76.33 శాతంగా ఉంది. ఈ ప్రాధాన్యతా రంగ లక్ష్యాల్లో అత్యధికంగా 60.85 శాతం వ్యవసాయ రంగానికి కేటాయించారు. దీని వాటా మొత్తం రూ.1,12,763.59 కోట్లుగా నిర్ధారించారు. అలాగే ఎంఎస్‌ఏంఈ విభాగానికి రూ.54,672.44 కోట్లను కేటాయించారు. దీని వాటా 30 శాతంగా ఉంది. ఇదిలా ఉండగా.. నాబార్డ్‌ మాత్రం రైతులకు స్థిరమైన ఆదాయాన్ని సృష్టించేందుకు రూ.39,325.87 కోట్ల పెట్టుబడి రుణాలు పంపిణీ చేయాలని సూచించింది.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.