ETV Bharat / state

'ఉపాధి హామీపై కొత్త సర్క్యూలర్​ వెంటనే ఉపసంహరించండి..' - జాతీయ ఉపాధి హామీ పథకంట

దేశంలో ఉపాధి హమీ పథకాన్ని నిర్వీర్యం చేసేలా కేంద్రం సర్క్యూలర్ జారీ చేయటం పేదల నోట్లో మట్టికొట్టడమేనని మంత్రి హరీశ్​ రావు పేర్కొన్నారు. కూలీల వ్యతిరేక నిబంధనలు రూపొందించిన ఆ సర్క్యూలర్​ను వెంటనే ఉపసంహరించుకోకపోతే ప్రజా ఆగ్రహానికి గురికాక తప్పదని హరీశ్‌రావు హెచ్చరించారు. ఈ మేరకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ఆయన బహిరంగ లేఖ రాశారు.

harish rao
harish rao
author img

By

Published : Aug 2, 2022, 2:41 PM IST

దేశంలో జాతీయ గ్రామీణ ఉపాధి హమీ పథకాన్ని నిర్వీర్యం చేసే విధంగా సర్క్యులర్ జారీ చేసిన కేంద్ర ప్రభుత్వం వైఖరిపై ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే ఎన్నో ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేసి ఉపాధిని దెబ్బతీసిన కేంద్రం... జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసేలా సర్క్యులర్ జారీ చేసి పేదల నోట్లో మట్టికొట్టడమేనని ఆరోపించారు. తెలంగాణ అభివృద్ధికి పూర్తి వ్యతిరేకంగా కుట్రలు చేస్తున్న భాజపా నాయకత్వం... దేశంలో కూలీలతో పాటు తెలంగాణలో ఉన్న 57.46 లక్షల జాబ్‌ కార్డులు కలిగిన 1,21,33,00 మంది ఉపాధి హామీ కూలీల హక్కులు కాలరాస్తోందని ఆరోపించారు. ఈ మేరకు మంత్రి కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డికి బహిరంగ లేఖ రాశారు.

పెండింగ్ నిధుల సంగతేంటి..?: నిరుపేదలకు ఆదాయం, ఆహార భద్రత కల్పిస్తున్న ఉపాధి హామీ పథకం రద్దు చేసే కుట్రలకు కేంద్రం పాల్పడుతోందంటూ ఆ లేఖలో ఆరోపించారు. ఇంతకు ముందెన్నడూ లేని రీతిలో తనిఖీలు ప్రారంభించిందని, కుక్కను చంపడానికి పిచ్చికుక్క అని ముద్ర వేసినట్లు... పేదల పాలిట కల్పతరువైన ఉపాధి హామీ పథకంపై అవినీతి ముద్ర వేసి రద్దు చేసే కుట్ర సాగుతున్నట్లు స్పష్టంగా అర్థమవుతోందన్నారు. కూలీలు చేసిన పనికి వేతనం చెల్లించకపోవడం దేనికి సంకేతం... దేశవ్యాప్తంగా దాదాపు 10 వేల కోట్ల రూపాయలు వేతనాలు పెండింగ్‌లో ఉన్నాయని స్వయంగా కేంద్ర మంత్రి ఇటీవల రాజ్యసభలో చెప్పడం నిజం కాదా... అని ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాల్లోనే 4700 కోట్ల రూపాయలు, తెలంగాణ సంబంధించి 83 కోట్ల రూపాయలు చెల్లించలేదని అంగీకరించడం వాస్తవం కాదా...? 2022-23 కేంద్ర బడ్జెట్‌లో ఉపాధి హామీ పథకానికి కేవలం 73 వేల కోట్ల రూపాయలు కేటాయించడం ఏంటి...? ఇందులో 18,380 కోట్ల రూపాయలు గత ఏడాది చెల్లించాల్సిన బకాయి వేతనాలకే సరిపోతాయి... ఇక మిగిలిన నిధులు ఈ పథకం అమలుకు ఏ మూలకు సరిపోతాయని తెలిపారు.

కూలీలపై కక్ష ఎందుకు..?: వేసవి లేదా వానాకాలంలో పనిచేసేటప్పుడు కూలీలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా సదరు సర్క్యులర్‌లో పొందుపరచడం అమానవీయం కాదా...? పనిచేసే కూలీలను అవమానించేలా వర్క్‌సైట్‌లో ఉండి రోజుకు రెండు స్టార్లు మస్టర్ రోల్ అటెండెన్స్, ఫోటోలు అప్‌లోడ్‌ చేయాలని సర్క్యులర్‌లో పేర్కొనడం గర్హనీయం అని తీవ్రంగా తప్పుపట్టారు. సర్పంచులు, ఎంపీటీసీలు, వార్డు సభ్యులుగా ఓడిపోయిన వారందరికీ ఈ పథకంపై పర్యవేక్షణ అధికారాలు కల్పించడం ఏంటి...? అసలు రనర్ అప్ అనే పదం వాడటం ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేయడమేనని విమర్శించారు. ఈ పథకం ద్వారా తెలంగాణ ప్రభుత్వం అనేక రకాల పనులు చేపడుతుండటం వల్ల రైతులు లబ్ధిపొందుతున్నారని చెప్పారు. కానీ, గ్రామాల్లో 20 పనులు మాత్రం చేపట్టాలని కేంద్ర చెబుతుండటం వల్ల కూలీలకు పనులు ఎంపిక చేసుకునే అవకాశం సన్నగిల్లుతుందని వివరించారు. ఈ అశాస్త్రీయ విధానాల వల్ల కూలీలు ఉపాధి హామీకి దూరమవుతారని ఆందోళన వ్యక్తం చేశారు. వ్యవసాయానికి ఉపాధి హామీ అనుసంధానం చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అసెంబ్లీలో తీర్మానం చేసి పంపితే పట్టించుకున్న పాపాన పోలేదని ధ్వజమెత్తారు. ఈ నిర్ణయం వెంటనే ఉపసంహరించుకోకపోతే ప్రజా ఆగ్రహానికి గురికాక తప్పదని హరీశ్‌రావు హెచ్చరించారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.