ETV Bharat / state

రాష్ట్రానికి రావాల్సిన గ్రాంట్లు వెంటనే విడుదల చేయండి.. కేంద్రానికి హరీశ్​ లేఖ - harish rao letter to nirmala seetha raman regarding grants to telangana

Minister Harish Rao letter to Central Minister Nirmala Sitharaman: తెలంగాణకు రావాల్సిన గ్రాంట్ల విషయంలో స్పందించాలని కోరుతూ రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్​ రావు.. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​కు లేఖ రాశారు. పెండింగ్​లో ఉన్న ఐజీఎస్టీ నిధులను కూడా విడుదల చేయాలని కోరారు. ఈ మేరకు లేఖలో పలు విజ్ఞప్తులు చేశారు.

minister harish rao letter to nirmala seetharaman
నిర్మలా సీతారామన్​కు​ హరీశ్​ రావు లేఖ
author img

By

Published : Jan 24, 2022, 7:42 PM IST

Minister Harish Rao letter to Central Minister Nirmala Sitharaman: కేంద్ర ప్రభుత్వం నుంచి తెలంగాణకు రావాల్సిన గ్రాంట్లను విడుద‌ల చేయాలంటూ ఆర్థిక శాఖ మంత్రి హ‌రీశ్‌రావు.. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామ‌న్‌కు లేఖ రాశారు. గతంలో చేసిన అభ్యర్థనలను మంత్రి హరీశ్​ రావు ఈ లేఖ‌లో గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 94 (2) ప్రకారం వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి కేటాయించిన నిధుల్లో రెండేళ్ల బ‌కాయిలు రూ. 900 కోట్లు ఇంకా విడుదల చేయాల్సి ఉందని హరీశ్​.. లేఖలో పేర్కొన్నారు. వీటిని విడుద‌ల చేయడంతో పాటు గ్రాంట్‌ను 2021-22 తర్వాత ఐదేళ్లపాటు పొడిగించాలని కోరారు. నీతిఆయోగ్ సూచించిన మేర‌కు రూ. 24,205 కోట్లు విడుద‌ల చేయాల్సిందిగా కేంద్రాన్ని విజ్ఞప్తి చేశారు. స్థానిక సంస్థలకు రూ. 817.61 కోట్లు (గ్రామీణ స్థానిక సంస్థలకు రూ. 315.32 కోట్లు, పట్టణ స్థానిక సంస్థలకు రూ. 502.29 కోట్లు) ఇవ్వాల‌న్న 14వ ఆర్థిక సంఘం సిఫార‌సుల‌ను కేంద్రం ఎందుకు తిర‌స్కరించిందో ఇప్పటికీ అర్థం కావ‌డం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రం అన్ని షరతులను పూర్తి చేసినప్పటికీ, నిర్దిష్ట కారణం లేకుండా ఈ గ్రాంట్లను తిర‌స్కరించారని ఆరోపించారు. వీలైనంత త్వరగా గ్రాంట్లు విడుదలయ్యేలా చూడాలని అభ్యర్థించారు.

ఎప్పుడూ తిరస్కరించలేదు

'స్థానిక సంస్థలకు రూ.817.61 కోట్లు ఇవ్వాల‌న్న 14వ ఆర్థిక సంఘం సిఫార‌సుల‌ను కేంద్రం ఎందుకు తిర‌స్కరించిందో అర్థం కావ‌డంలేదు. ఆర్థిక సంఘం సిఫారసులను గతంలో ఎప్పుడూ తిర‌స్కరించిన సంద‌ర్భాలు లేవు. ఎలాంటి ఆలస్యం లేకుండా ఆ నిధుల‌ను మంజూరు చేయండి. 2014- 15లో తెలంగాణకు రావాల్సిన వాటాను.. కేంద్రం పొర‌పాటున ఏపీకి విడుదల చేసింది. ఆ నిధులను మాకు విడుదల చేయండి.' అని హరీశ్​ లేఖలో పేర్కొన్నారు.

ఏపీకి విడుదల చేశారు

2019- 20 తో పోల్చితే 2020-21 లో రాష్ట్రానికి పన్నుల్లో వాటా తగ్గుతుందని.. ఈ మేర‌కు తెలంగాణ‌కు రూ.723 కోట్ల ప్రత్యేక గ్రాంట్ విడుద‌ల చేయాల‌ని 15 వ ఆర్థిక సంఘం సూచించిందని హరీశ్​ లేఖలో పేర్కొన్నారు. ఆర్థిక సంఘం సిఫార్సుల‌ను కేంద్రం గతంలో ఎప్పుడూ తిర‌స్కరించిన సంద‌ర్భాలు లేవని హరీశ్​ గుర్తు చేశారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న కేంద్ర ప్రాయోజిత పథకాల్లో.. రాష్ట్రం ఏర్పడిన సంవత్సరం 2014-15 లో కేంద్రం.. వాటాను తెలంగాణ‌కు కాకుండా ఆంధ్రప్రదేశ్‌కు విడుదల చేశారని హరీశ్​ పేర్కొన్నారు. దీంతో రాష్ట్రానికి రావాల్సిన రూ. 495.20 కోట్లు ఏపీకి వెళ్లాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని ఏపీ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లినా.. రాష్ట్రానికి ఇంకా ఆ నిధులు సర్దుబాటు చేయలేదని ఆరోపించారు. ఆ మొత్తాన్ని వెంట‌నే విడుదల చేయాలని.. వీటితో పాటు పెండింగ్​లో ఉన్న ఐజీఎస్టీ నిధులు రూ. 210 కోట్ల‌ను కూడా స‌ర్దుబాటు చేయాల్సిందిగా మంత్రి హరీశ్​ రావు.. లేఖ ద్వారా కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.

ఇదీ చదవండి: Mirchi Farmers Protest: 'మిర్చి కొనుగోలు చేసే వరకు కదిలేదే లే'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.