హైదరాబాద్ యూసఫ్‌గూడలో అక్షరార్చన పేరుతో విద్యార్థులకు సెమినార్ కార్యక్రమాన్ని ప్రముఖ సామాజికవేత్త మల్లికార్జున నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రముఖ నవలా రచయిత యండమూరి వీరేంద్రనాథ్, ప్రముఖ హిప్నాటిస్ట్ పట్టాభిరామ్ పాల్గొన్నారు.
సాంకేతిక పరిజ్ఞానానికి విద్యార్థులు అలవాటవుతున్నారని.. చేతితో రాయడమంటే కొంత అలసత్వాన్ని చూపిస్తున్నారని వీరేంద్రనాథ్ అన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా చేతిరాతను అభివృద్ధి చేసుకుంటే భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారన్నారు.
విద్యార్థులు చిన్నతనం నుంచే చేతిరాత నైపుణ్యాన్ని అలవాటు చేసుకోవాలని హిప్నాటిస్ట్ పట్టాభిరామ్ తెలిపారు. అనంతరం విద్యార్థులకు చేతిరాత నైపుణ్యంపై పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు.
ఇదీ చూడండి: 'ఇంటి ముందు ఇసుకుంటే 25 వేలు జరిమానా వేస్తారా..'