ETV Bharat / state

పళ్లెంలో ఏ పోషకాలుండాలో సూచించిన ఐసీఎంఆర్‌.. - ఐసీఎంఆర్​ మార్గదర్శకాలు

కరోనా బారిన పడకుండా ఉండాలంటే పోషకాహారం తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. రోగనిరోధక శక్తి పెరగాలంటే రోజువారీగా మన కంచంలో ఏయే పోషకాలు, ఎంతెంత మోతాదులో ఉండేలా చూసుకోవాలో వివరిస్తూ ఇటీవల భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) మార్గదర్శకాలు కూడా ఇచ్చింది. అంతవరకు బాగానే ఉన్నా నిత్యావసర సరకుల ధరలు మండిపోతున్న ప్రస్తుత తరుణంలో పేదలు ఖరీదైన ఆహార పదార్థాలను కొనుక్కోవడం సాధ్యమేనా? ‘కొవిడ్‌ సంక్షోభం వల్ల ఉద్యోగాలు, ఉపాధి పోయి చాలామందికి ఆదాయం తగ్గింది. ఇలాంటి పరిస్థితుల్లో అధిక శక్తినిచ్చే పోషకాహారం కొని తినడం పేదలు, అల్పాదాయ వర్గాలకు కష్టసాధ్యమే’ అని పోషకాహార నిపుణులు అభిప్రాయపడుతున్నారు. చౌకగా లభించే పోషకాలపై అవగాహన కల్పించడంతోపాటు, చౌక దుకాణాల ద్వారా పప్పులు, నూనెలు, తృణధాన్యాలను పేదలకు అందుబాటులో ఉంచాలని పేర్కొంటున్నారు.

Guidelines of the Medical Research Council of India (ICMR)
పళ్లెంలో ఏ పోషకాలుండాలో సూచించిన ఐసీఎంఆర్‌..
author img

By

Published : Sep 28, 2020, 8:58 AM IST

వివరాలిలా...

ఎక్కువ శాతం తక్కువ ఆదాయం వారే

  • జాతీయ నమూనా సర్వే నివేదిక-2016 ప్రకారం దేశంలో చిన్న, సన్నకారు రైతుల నెలవారీ ఆదాయం రూ. 4,561-7,348 వరకూ ఉంది. రాష్ట్రంలో ఎక్కువశాతం రైతు కుటుంబాలు సన్న, చిన్నకారువే.
  • కుటీర పరిశ్రమలు, చిరు వ్యాపారాలతో స్వయం ఉపాధి పొందేవారు, తక్కువ వేతనంతో పనిచేసే వారు జనాభాలో 50 శాతానికిపైగా ఉన్నారు. వీరి ఆదాయం నెలకు రూ.10-15 వేలకు మించదు.
  • ఐసీఎంఆర్‌ సూచించిన ప్రకారం పోషకాహారం తినాలంటే ఒక వ్యక్తి రోజూ రూ. 275-300 దాకా ఖర్చు చేయాలి. పేదలు ఆహారానికే అంత ఖర్చు పెట్టడం సాధ్యమా? అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.

వీటిలోనూ అధిక పోషకాలు..

ప్రస్తుత కోవిడ్‌ పరిస్థితులలో రోగనిరోధకశక్తి పెరగడానికి ప్రొటీన్లు ఎక్కువ ఉండే ఆహారాన్ని తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. మనం రోజువారీ వాడే ఆహార పదార్థాల్లో ఎక్కువశాతంలో పోషకాలు, ప్రొటీన్లు ఉండేవాటి వాడకం పెంచుకోవాలని సహజ ఆహారోత్పత్తుల నిపుణుడు విజయరామ్‌ తెలిపారు.

చౌకలోనే విలువైన పోషకాలెన్నో..

  • నువ్వులు, నువ్వులపప్పు నుంచి నూనె తీసిన తరువాత వచ్చే తెలగపిండిలో చాలా ప్రొటీన్లు ఉంటాయి. కానీ ఇది తెలియక చాలామంది దానిని కేవలం పశువులకు దాణాగా వాడుతుంటారు. తెలగపిండితో కూర వండుకోవచ్చు.. వడియాలు పెట్టుకోవచ్చు. మాంసాహారులైతే ఎండురొయ్యలు కలిపి వండుకోవచ్చు. శాకాహారులైతే పచ్చి శనగపప్పు లేదా పెసరపప్పును నానబెట్టి తెలగపిండితో కలిపి కూర వండుకోవచ్చు.
  • పెసలు, శనగలను నానబెట్టి మొలకలు వచ్చాక తింటే వాటిలో ప్రొటీన్లు, హార్మోన్లు, ఎంజైమ్‌లు లభిస్తాయి.ఉప్పుశనగలు, నువ్వులు-బెల్లం ముద్ద, పల్లీల పచ్చడిలో కూడా ప్రొటీన్లు ఎక్కువ ఉంటాయి.
  • పెసరపప్పు లేదా కందిపప్పు ఉడకబెట్టిన నీటిలో సులభంగా జీర్ణమయ్యే ప్రొటీన్లు అధికం.
  • ఉడక బెట్టిన బఠాణీలు, రాజ్‌మాలు, చిక్కుడు, తమ్మకాయ గింజలలోనూ ప్రొటీన్లు పుష్కలం.
  • రాగులు, సజ్జలు, జొన్నలను నానబెట్టి మొలకలు వచ్చాక ఎండబెట్టి పొడి చేసుకుని వాడితే ప్రొటీన్లు ప్రొటీన్లు పుష్కలంగా లభిస్తాయి. వాటి పొడితో జావ లేదా పాయసం లేదా అంబలిలాగా చేసుకోవచ్చు. రాత్రి సమయంలో తాగితే మజ్జిగ లేదా పెరుగు కలపకుండా వాడాలి.
  • వేయించిన కందిపప్పు లేదా పెసరపప్పును పొడి చేసి ధనియాలు, మిర్చి, జీలకర్ర, ఉప్పు కలిపి పొడిలా చేసి అన్నం లేదా అల్పాహారంలో కలిపి తీసుకోవచ్చు. ఇష్టమైన వారు వెల్లుల్లి వేసుకోవచ్చు. ఈ పొడిలో కొంచెం నూనె లేదా నెయ్యి వేసుకుని తింటే రుచితోపాటు పోషకాలు అందుతాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.