ETV Bharat / state

Gruha Lakshmi Scheme Last Date Today : 'గృహలక్ష్మి'కి నేడే లాస్ట్‌ డేట్.. అప్లై చేసుకున్నారా..?

Gruha lakshmi Scheme Last Date Today : గృహలక్ష్మి పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు ప్రజలు.. ప్రభుత్వ కార్యాలయాల వద్దకు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. మొదటి విడతకు నేటితో గడువు ముగుస్తుండటంతో ఇళ్లు లేని పేదలు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు.. గృహలక్ష్మి పథకం నిరంతర ప్రక్రియ అని.. దీనికి తుది గడువు అంటూ ఏమీ లేదని మంత్రి ప్రశాంత్‌రెడ్డి స్పష్టం చేశారు. మొదటి విడతకు మాత్రమే నేడు ఆఖరి తేదీ అని.. అనంతరం మళ్లీ విడతల వారీగా ఈ ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు.

Gruhalakshmi Scheme Last Date in Telangana
Gruhalakshmi Scheme Last Date Today
author img

By

Published : Aug 10, 2023, 6:58 AM IST

Updated : Aug 10, 2023, 2:12 PM IST

Gruha Lakshmi Scheme Last Date Today : 'గృహలక్ష్మి'కి నేడే లాస్ట్‌ డేట్.. అప్లై చేసుకున్నారా..?

Gruha lakshmi Scheme Last Date Today : ఇళ్లు లేని పేదల సొంతింటి కల నెరవేరేందుకు.. గృహలక్ష్మి పథకాన్ని ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టింది. దీనికోసం ప్రజల నుంచి దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. మొదటి విడత దరఖాస్తుల స్వీకరణకు నేడు తుది గడువు కావడంతో మీసేవా కేంద్రాలు, ప్రభుత్వ కార్యాలయాలు కిక్కిరిసిపోతున్నాయి. గడిచిన మూడు రోజుల్లో వేల సంఖ్యలో దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. సమయం తక్కువగా ఉండటంతో ఇబ్బందిగా ఉందని.. గడువు పెంచాలని ప్రజలు కోరుతున్నారు.

Gruhalakshmi Scheme in Telangana : గృహలక్ష్మి పథకానికి అప్లై చేస్తున్నారా.. ఐతే ఈ డాక్యుమెంట్స్​ ఉండాల్సిందే!

Gruha lakshmi Scheme Telangana : నారాయణపేట జిల్లాలో గృహలక్ష్మి పథకానికి దరఖాస్తు చేసేందుకు ప్రజలు పోటీపడ్డారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపల్ కార్యాలయం జనాలతో కిక్కిరిసిపోయింది. దాంతో దరఖాస్తుల స్వీకరణకు ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ తహసీల్దార్‌ కార్యాలయానికి గృహలక్ష్మి పథకం(Gruhalakshmi Scheme) కోసం దరఖాస్తుదారులు పోటెత్తారు. అవసరమైన పత్రాలు అందకపోతే లబ్ధి పొందలేమని ఆశావహులు ఆవేదన చెందుతున్నారు. గడువు పెంచే విషయంపై ప్రభుత్వం పునరాలోచన చేయాలని కోరుతున్నారు. మరోవైపు కరీంనగర్ నగరపాలక సంస్థలో దరఖాస్తులు స్వీకరిస్తుండగా.. గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం తమకు ఎలాంటి ఉత్తర్వులు రాలేదని అధికారులు చెబుతుండటంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.

Gruhalakshmi Scheme Last Date : 'గృహలక్ష్మి పథకానికి అప్లై చేయలేదా.. ఆందోళన వద్దు.. ఇంకా ఛాన్స్ ఉంది'

Gruha lakshmi Scheme Telangana
గృహలక్ష్మికి నేడే లాస్ట్‌ డేట్.. అప్లై చేసుకున్నారా..

Gruhalakshmi Scheme Application : నిబంధనల ప్రకారం గృహలక్ష్మి కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో.. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఈ పథకాన్ని అమలు చేస్తామని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. 20వ తేదీలోగా దరఖాస్తుదారుల వెరిఫికేషన్ పూర్తి చేసి 25న తొలి దశ లబ్దిదారులను(Gruhalakshmi Scheme Beneficiaries) ఎంపిక చేస్తామన్నారు. గృహలక్ష్మి పథకం నిరంతర ప్రక్రియ అని గృహ నిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి స్పష్టం చేశారు. సొంత స్థలం ఉన్న వారికి ఇంటి నిర్మాణం కోసం రూ.3 లక్షలు ఇవ్వాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారన్న ఆయన.. పథకాన్ని నిరంతర ప్రక్రియగా అమలు చేస్తామని పేర్కొన్నారు.

GruhaLakshmi Scheme in Telangana : 'గృహలక్ష్మి'కి దరఖాస్తుల కోసం బారులు.. గడువు పెంచాలంటూ విన్నపాలు

Gruha lakshmi Scheme Online Application Last Date : గ్రామకంఠంలో పాత ఇల్లు, స్థలాలకు దస్తావేజులు ఉండవన్న ప్రశాంత్ రెడ్డి.. ఇంటి నంబర్, లేదంటే ఖాళీ స్థలం ఉన్నా దరఖాస్తు చేసుకోవచ్చని వివరించారు. గడువు ముగిసినా.. ప్రజాప్రతినిధుల ద్వారా కలెక్టర్‌కు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ప్రతి నియోజకవర్గానికి తొలి విడత 3 వేల ఇళ్లు కేటాయిస్తామన్నారు. మొదటి విడతలో లబ్ధి పొందని వారు నిరాశపడకుండా.. రెండో విడతలో దరఖాస్తు చేసుకోవచ్చని వివరించారు. అర్హులైన పేదల ఇంటి నిర్మాణం కోసం గృహలక్ష్మి పథకాన్ని దశల వారీగా అమలు చేస్తామని మంత్రి తెలిపారు.

దరఖాస్తు సమయంలో ఈ పత్రాలు తప్పనిసరి..:

  • గృహలక్ష్మి పథకం దరఖాస్తు ఫారం
  • రేషన్ కార్డు
  • ఓటరు గుర్తింపు కార్డు
  • ఆధార్ కార్డు
  • ఇంటి స్థలం దస్తావేజులు (దస్తావేజులు లేకపోతే ప్రస్తుత ఇంటి నెంబర్‌ తెలిపిన సరిపోతుంది)

'గృహలక్ష్మి పథకం' కింద మూడు విడతల్లో రూ.3 లక్షలు'

Gruhalaxmi Scheme Guidelines : 'గృహలక్ష్మి పథకం'.. మార్గదర్శకాలు తెలుసుకోండి..

Last Updated : Aug 10, 2023, 2:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.