మైనారిటీల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని హైదరాబాద్ చైతన్యపురి డివిజన్ మైనారిటీ విభాగం అధ్యక్షుడు ఎస్కే జాఫర్ పేర్కొన్నారు. తెరాస కార్యాలయం వద్ద కార్పొరేటర్ జిన్నారం విఠల్‌రెడ్డి... తన సొంత ఖర్చులతో రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని సుమారు 50 మంది మైనారిటీ కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.
పండుగలు శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని విఠల్‌రెడ్డి సూచించారు. పండుగలు సోదరభావాన్ని పెంపొందిస్తాయన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో మైనారిటీల సంక్షేమం కోసం అనేక పథకాలు ప్రవేశ పెట్టిందన్నారు.