ETV Bharat / state

కరోనా సమయంలో ఆశా వర్కర్ల పాత్ర కీలకం: డిప్యూటీ స్పీకర్ - తెలంగాణ వార్తలు

సికింద్రాబాద్​ సీతాఫల్​మండిలోని ఆశా వర్కర్లకు నిత్యావసర సరుకులను డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ అందజేశారు. కరోనా సమయంలో వారి పాత్ర కీలకమని కొనియాడారు. కార్పొరేటర్ హేమ సామలని ఆయన అభినందించారు.

groceries distribution to asha workers, deputy speaker padma rao
నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన డిప్యూటీ స్పీకర్, ఆశా వర్కర్ల సేవలు
author img

By

Published : May 19, 2021, 10:11 AM IST

సికింద్రాబాద్ సీతాఫల్​మండిలో ఆశా వర్కర్లకు డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్, కార్పొరేటర్ హేమ సామల ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఆశా వర్కర్లకు అండగా నిలిచిన కార్పొరేటర్ హేమ సామలని ఆయన అభినందించారు. కరోనా సమయంలో ఆశావర్కర్లు కీలక పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు.

ఆశా వర్కర్లకు సరుకులు పంపిణీ చేయడం ఆనందంగా ఉందని కార్పొరేటర్ హేమ అన్నారు. ఈ విపత్కర సమయంలో వారి సేవలు మరువలేనివని కొనియాడారు. వారికి తమవంతుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తెరాస నాయకులు సాయి, దుర్గ ప్రసాద్, గౌతమ్, మహేష్, పద్మ, అర్చన తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: 'నిరంతరం కొత్తరూపంలోకి వైరస్‌.. సమగ్ర అధ్యయనం అవసరం'

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.