ETV Bharat / state

నిరుపేదలకు ఆదిత్యకృష్ణ ఛారిటబుల్​ ట్రస్ట్​ ఆపన్నహస్తం

లాక్​డౌన్​ నేపథ్యంలో నిరుపేదలకు ఆదిత్యకృష్ణ ఛారిటబుల్​ ట్రస్ట్​ చేయూతను అందిస్తోంది. హైదరాబాద్​ గోషామహల్​లోని మోచి బస్తీలో నివసిస్తున్న 500 నిరుపేద కుటుంబాలకు వారానికి సరిపడా నిత్యావసర సరకులను ట్రస్ట్​ ఛైర్మన్​ అందజేశారు.

groceries distribution in hyderabad
నిరుపేదలకు ఆదిత్యకృష్ణ ఛారిటబుల్​ ట్రస్ట్​ ఆపన్నహస్తం
author img

By

Published : Apr 26, 2020, 3:43 PM IST

లాక్​డౌన్​ కొనసాగుతున్న నేపథ్యంలో ఆకలితో అలమటిస్తున్న నిరుపేదలకు ఆదిత్యకృష్ణ ఛారిటబుల్ ట్రస్ట్​ ఆపన్నహస్తం అందిస్తోంది. హైదరాబాద్ గోషామహల్ డివిజన్​లోని మోచి బస్తీలో కులవృతిపై ఆధారపడి జీవిస్తున్న 500వందల కుటుంబాలకు వారానికి సరిపడే నిత్యావసర సరకులను పంపిణీ చేశారు. ఆదిత్య కృష్ణ ఛారిటబుల్ ట్రస్ట్ ఛైర్మన్ నందకిషోర్ బిలాల్​ తమ చేతుల మీదుగా అందజేశారు.

ప్రజలంతా భౌతిక దూరం పాటించాలని ఆయన సూచించారు. నిరుపేదలు ఎవరూ కూడా ఆకలితో అలమటించవద్దనే సంకల్పంతో తమ ట్రస్ట్ విశేషంగా కృషిచేస్తుందని పేర్కొన్నారు. కొవిడ్-19 మహమ్మారిని తరిమికొట్టడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో కృషిచేస్తున్నారని వెల్లడించారు.

ఇవీ చూడండి: పౌరులంతా సైనికులే.. అందరికీ సెల్యూట్​: మోదీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.