హైదరాబాద్‌లో వర్ష బీభత్సంతో ముంపునకు గురైన బాధితులకు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ నిత్యావసర సరకులు అందజేశారు. సోమాజిగూడ డివిజన్ పరిధిలోని హరిగేట్‌లో సుమారు 200 మంది వరదల్లో చిక్కుకున్నట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు.
బాధితుల ఇళ్లల్లో నిత్యావసర సరకులు నీటిలో నాని పోవడంతో, వారు ఇబ్బందులు పడకుండా సరకులను అందజేసినట్లు ఎమ్మెల్యే దానం నాగేందర్ తెలిపారు. నియోజకవర్గ పరిధిలో ముంపునకు గురైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం తరఫున సహాయం అందజేయాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారని ఆయన తెలిపారు.