ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకొని హైదరాబాద్ సోమాజిగూడలో ఏర్పాటు చేసిన జాతీయ గిరిజన ఐక్య వేదిక సదస్సులో అధ్యక్షుడు కె.వివేక్ నాయక్ పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఆదివాసీ, ఇతర సామాజిక వర్గాలకు అభివృద్ధి ఫలాలు అందడం లేదని ఆయన ఆరోపించారు. అటవీ గిరిజన హక్కుల చట్టం-2006 అమలు చేయడంలో తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని విమర్శించారు. ఆదివాసీలు ఎదుర్కొంటున్న పోడు భూముల హక్కులు, పట్టాలు, ఆదిలాబాద్‌లో గిరిజన వర్సిటీ ఏర్పాటు చేయాలన్న అంశాలను మంత్రుల దృష్టికి తీసుకెళతామని ఆయన పేర్కొన్నారు.
ఇదీ చూడండి: జైపాల్‌రెడ్డికి పలువురు నేతల నివాళి