వైశాఖ శని పౌర్ణమిని పురష్కరించుకుని కంటోన్మెంట్ తదితర ప్రాంతాల్లోని దేవాలయాల్లో విశిష్ట పూజలు నిర్వహించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలోని చారిత్రాత్మక గణపతి ఆలయంలో తెల్లవారుజాము నుంచి వేద మంత్రాలతో గణపతి హోమం, అభిషేకాలు, శనైశ్చరుడికి ప్రత్యేక పూజలు, సత్యనారాయణ స్వామి వ్రత కార్యక్రమాలు ఘనంగా జరిపించారు.
భక్తుల సౌకర్యార్థం సూపరింటెండెంట్ బి.కె.రెడ్డి తగిన ఏర్పాట్లు చేయించారు. భక్తులు వందలాదిగా తరలివచ్చి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. తాడ్బండ్లోని వీరాంజనేయ స్వామి దేవాలయం, కార్ఖానాలోని ఆంజనేయ స్వామి , పాతబోయిన్పల్లిలోని స్వయంభూ ప్రసన్న బాలాంజనేయ, కానాజిగూడలోని మరకత శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంతో పాటు బొల్లారం, లాల్ బజార్, తిరుమలగిరి, బోయిన్ పల్లి, పికెట్, మారెడ్పల్లి తదితర ప్రాంతాల దేవాలయాల్లో విశిష్ట పూజలు నిర్వహించారు.
ఇవీ చూడండి : కన్నుల పండువగా స్వామివారి కల్యాణం