భారత రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని జాతీయ యువజన అవార్డు గ్రహీతల సంఘం వ్యవస్థాపకుడు సామలవేణు విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నల్లగొండ, ఖమ్మం, వరంగల్ ఉమ్మడి జిల్లాల పట్టుభద్రులు శాసన మండలి ఎన్నికల సందర్భంగా విధిగా ఓటు హక్కు నమోదు చేసుకోవాలని సూచించారు.
సంబంధిత జిల్లాలోని 2017, అక్టోబర్ 31 నాటికి డిగ్రీ పూర్తి చేసిన వారందరూ ఓటు నమోదు చేసుకోవాలన్నారు. ఓటు నమోదుకు సంబంధించి ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో ఫారం- 18 ప్రకారం ఓటు నమోదు ఏవిధంగా చేసుకోవాలో అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు.
ఇదీ చూడండి: ధరణి పోర్టల్ నిర్వహణ కోసం శనివారం నుంచి శిక్షణ