వర్గీకరణ పేరుతో పాలకులు.. షెడ్యూల్ కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తున్నారని మాల మహానాడు జాతీయ అధ్యక్షులు చెన్నయ్య ఆరోపించారు. బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో మాల మహానాడు రెండు తెలుగు రాష్ట్రాల కార్యవర్గంతో కలిసి ఆయన సమావేశం నిర్వహించారు.
గ్రామ స్థాయి నుంచి.. కార్యకర్తలను బలోపేతం చేసి, ఎస్సీ వర్గీకరణను అడ్డుకుంటామని చెన్నయ్య స్పష్టం చేశారు. రిజర్వేషన్లను కాపాడుకునేందుకు ఎస్టీ, బీసీ సంఘాలతో కలిసి ఐక్య ఉద్యమాలు చేస్తామని వివరించారు.
ఎస్సీ కార్పొరేషన్ నిధులను ఎలాంటి షరతులు లేకుండా కేటాయించాలని చెన్నయ్య డిమాండ్ చేశారు. నూతనంగా నిర్మిస్తున్న పార్లమెంట్ భవన్‌కు అంబేడ్కర్.. పేరు పెట్టాలని సూచించారు.
ఇదీ చదవండి: గుర్తు పెట్టుకోండి.. అంధ విశ్వాసాలు మిగిల్చేది.. విషాదాలే!