ETV Bharat / state

Govt Submitted Flood Relief Measures Report to Highcourt : 'వరద నష్టం అంచనాపై కసరత్తు జరుగుతోంది'.. హైకోర్టుకు ప్రభుత్వం నివేదిక - తెలంగాణ వరదపై హైకోర్టుకు నివేదిక ఇచ్చిన ప్రభుత్వం

Govt Submitted Flood Relief Measures Report to Highcourt : రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలు, వరదలపై తీసుకున్న జాగ్రత్తలు, నష్టాలపై రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదిక సమర్పించింది. ఈ మేరకు సీఎం కేసీఆర్​ రూ.500 కోట్లను వరద ప్రాంతాల్లో సహాయం కోసం ప్రకటించారని ప్రభుత్వం తరఫున రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా హైకోర్టుకు నివేదిక సమర్పించారు. ప్రభుత్వ నివేదికను బుధవారం పరిశీలించి తగిన ఉత్తర్వులు ఇస్తామని హైకోర్టు తెలిపింది.

Telangana Govt Submit Report To High Court On Rains And Floods
Telangana Govt Submit Report To High Court On Floods
author img

By

Published : Aug 8, 2023, 7:47 PM IST

Govt Submitted Flood Relief Measures Report to Highcourt : ఇటీవల భారీ వర్షాలు, వరదల సందర్భంగా పూర్తి అప్రమత్తంగా వ్యవహరించడంతో పాటు.. బాధితులకు అన్ని విధాలుగా అండగా ఉన్నట్లు హైకోర్టుకు ప్రభుత్వం తెలిపింది. డాక్టర్ చెరుకు సుధాకర్ వేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై ప్రభుత్వం తరఫున రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా హైకోర్టుకు నివేదిక సమర్పించారు. వాతావరణ శాఖ హెచ్చరికల ఆధారంగా వర్షాలపై జిల్లా అధికార యంత్రాంగాన్ని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. పరిస్థితి తీవ్రత ఉన్న ప్రాంతాలకు ముందస్తుగా పది ఎన్​డీఆర్​ఎఫ్(NDRF)​ బృందాలు, రెండు హెలికాప్టర్లతో పాటు రాష్ట్ర పోలీసులు, అగ్నిమాపక శాఖ సిబ్బందిని పంపించినట్లు పేర్కొంది.

పాఠశాలలకు సెలవులు ప్రకటించినట్లు హైకోర్టుకు ప్రభుత్వం నివేదించింది. జిల్లా అధికార యంత్రాంగం ముందుగానే సహాయక శిబిరాలు, అవసరమైన వైద్య, ఆహార ఏర్పాట్లను సిద్ధం చేశాయని ప్రభుత్వం నివేదికలో తెలిపింది. వరదల సమయంలో ఎన్​డీఆర్​ఎఫ్​, ఐఏఎఫ్​, పోలీసులు, అగ్నిమాపక శాఖ సిబ్బంది.. రెండు హెలికాప్టర్లు, 27 బోట్లలో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారని నివేదికలో ప్రభుత్వం తెలిపింది.

Telangana Govt Submit Report To High Court On Rains And Floods 2023 : వరద ప్రభావిత ప్రాంతాల్లో(Telangana Floods) 11,748 మందిని 177 సహాయ కేంద్రాలకు తరలించినట్లు ప్రభుత్వం నివేదించింది. జిల్లా యంత్రాంగానికి చేదోడుగా ఉండేందుకు అనుభవమున్న ఏడుగురు రాష్ట్రస్థాయి అధికారులను పంపించినట్లు పేర్కొంది. సచివాలయం(Secretariat)లో 24 గంటలు అందుబాటులో ఉండేలా ఐఆర్​సీఎస్​ కేంద్రం ఏర్పాటు చేసి జిల్లా యంత్రాంగానికి ఎప్పటికప్పుడు సూచనలు, సాయం అందించినట్లు వివరించింది. జిల్లా స్థాయిలోనూ కంట్రోల్ రూమ్​లు ఏర్పాటు చేసినట్లు పేర్కొంది. కేంద్ర, రాష్ట్ర, స్థానిక వ్యవస్థలన్నీ సమన్వయంతో పనిచేశాయని నివేదికలో రాహుల్ బొజ్జా తెలిపారు.

వరదల ప్రభావం తగ్గిన తర్వాత బాధితులకు సహాయక చర్యలు కొనసాగించినట్లు ప్రభుత్వం తెలిపింది. మృతులు, క్షతగాత్రులను గుర్తించి ఎస్​డీఆర్​ఎఫ్​ నిబంధనల మేరకు బాధితులకు సాయం చేపట్టినట్లు తెలిపింది. వరదల వల్ల జరిగిన నష్టం అంచనాకు కసరత్తు జరుగుతోందని.. సాయం కోసం కేంద్రానికి నివేదిక పంపించే అవకాశం ఉందని ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. రోడ్లు, విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు యుద్ధ ప్రాతిపదికన పనులు ప్రారంభించామని నివేదికలో ప్రభుత్వం తెలిపింది. మృతులకు రూ.4 లక్షల పరిహారం చెల్లిస్తున్నట్లు పేర్కొంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయం కోసం ముఖ్యమంత్రి రూ.500 కోట్ల ప్రకటించారని రాహుల్ బొజ్జా హైకోర్టుకు తెలిపారు.

Telangana Govt Submit Floods Report To High Court : భారీ వర్షాలు, వరదలకు 471 రాష్ట్ర రహదారులు దెబ్బతిన్నాయని.. వాటిలో 181 రోడ్లను ఇప్పటికే తాత్కాలికంగా పునరుద్ధరించినట్లు ప్రభుత్వం తెలిపింది. పంచాయతీ రాజ్ రోడ్లు 118 దెబ్బతినగా.. ఇప్పటివరకు 75 తాత్కాలికంగా పునరుద్ధరించినట్లు పేర్కొంది. విద్యుత్ సరఫరా 773 గ్రామాల్లో దెబ్బతినగా.. 721 పునరుద్ధరణ పూర్తయిందని ప్రభుత్వం వివరించింది. మొబైల్, ఇంటర్నెట్ వ్యవస్థలను ప్రైవేట్ సంస్థలు పునరుద్ధరించాయని ప్రభుత్వం తెలిపింది.

వరద బాధితుల్లో మనో ధైర్యం నింపేందుకు వైద్య, ఎన్‌ఎంఏ సిబ్బంది, ఆశావర్కర్లు కౌన్సెలింగ్ ఇచ్చారని ప్రభుత్వం తెలిపింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో జ్వరాలు, వ్యాధులు ప్రబలకుండా ముందస్తుగా దోమల పాగింగ్, మంచినీటి సదుపాయం, పారిశుద్ధ్య నిర్వహణ వంటి చర్యలు చేపట్టామని తెలిపింది. ప్రభుత్వ నివేదికను బుధవారం పరిశీలించి తగిన ఉత్తర్వులు ఇస్తామని హైకోర్టు తెలిపింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.