కరోనా వ్యాక్సిన్ తయారు చేసి గర్వంగా గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకోబోతున్నామని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తెలిపారు. సనత్‌నగర్ ఈఎస్‌ఐ ఆస్పత్రిలో వ్యాక్సినేషన్‌ను ఆమె ప్రారంభించారు. టీకా ఉత్పత్తిలో దేశం స్వయం సమృద్ధి సాధించిందని తమిళిసై పేర్కొన్నారు. కొవిడ్ టీకా సురక్షితమని... ఎలాంటి అనుమానం లేకుండా తీసుకోవాలని సూచించారు. టీకా సాధారణ పౌరులకు అందుబాటులో వచ్చాక తానూ తీసుకుంటానని గవర్నర్ స్పష్టం చేశారు.
ఫ్రంట్‌లైన్ వారియర్స్‌పై టీకా టెస్టింగ్ చేస్తున్నారని కొందరంటున్నారని... ఇది టెస్టింగ్ కాదని గిఫ్టింగ్‌గా తమిళిసై పేర్కొన్నారు. ఇండియా గతంలో కలరాను ఎదుర్కొందని, అదే స్ఫూర్తితో ఈ మహమ్మారిపై పోరాటం చేయాలన్నారు. కొవిడ్ సమయంలో ఎన్నో నవ కల్పనలతో ఈఎస్‌ఐ ముందుకొచ్చిందని గవర్నర్ కొనియాడారు.
ఇదీ చదవండి: పెళ్లి విషయంలో మనస్పర్థలు... ప్రేమజంట ఆత్మహత్య