ETV Bharat / state

Governor Tamilisai Latest Comments : 'తెలంగాణలో ఎన్నో అవరోధాలు ఎదుర్కొంటున్నా'

Governor Tamilisai Comments on Telangana Government : తెలంగాణలో తాను ఎన్నో అవరోధాలు ఎదుర్కొంటున్నట్లు రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ఆరోపించారు. అవరోధాలను అవకాశాలుగా మార్చుకోవడమే తన బలమని ఆమె పేర్కొన్నారు. పరిస్థితులను ఆస్వాదిస్తూ.. వాటికి తగినట్లు స్పందించడం ద్వారా పని భారం లేకుండా చేసుకోవచ్చని ఆమె సూచించారు. హైదరాబాద్​లోని బోరుబండలో కిమ్స్‌ కడిల్స్‌ ఉమెన్‌ హెల్త్‌ కార్యక్రమంలో తమిళిసై పాల్గొన్నారు.

Tamilisai
Tamilisai
author img

By

Published : Jun 11, 2023, 3:55 PM IST

Updated : Jun 11, 2023, 4:17 PM IST

Governor Tamilisai Latest News in Telugu : కీర్తి రెడ్డి ఫౌండేషన్, రెడ్ క్రాస్ సొసైటీ సంయుక్తంగా హైదరాబాద్​లోని బోరబండ నాట్కో పాఠశాలలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి గవర్నర్​ తమిళిసై సౌందర రాజన్​ హాజరయ్యారు. ఈ సందర్బంగా మాట్లాడిన గవర్నర్​ తమిళిసై.. దేశ ప్రధాని నరేంద్ర మోదీ ప్రవేశ పెట్టిన ఆయుష్మాన్​ భారత్ పథకాన్ని రాజకీయాలకు అతీతంగా ప్రతి రాష్ట్రంలో అమలు చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. తెలంగాణలో ఎంతో మంది పేదలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారని గుర్తు చేశారు.

సీఎం కేసీఆర్​తో మాట్లాడి తెలంగాణలో ఆయుష్మాన్​ భారత్​ అమలు చేసినట్లు పేర్కొన్నారు. ప్రజాసేవ విషయంలో నాయకులు రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాలని సూచించారు. మహిళలు తమ సమస్యలు చెప్పేందుకు ముందుకు రావాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. బాల్యం నుంచే ఆడపిల్లలకు లైంగిక వేధింపులపై అవగాహన కల్పించాలని సూచించారు. తల్లిదండ్రులు కాస్త సమయం కేటాయిస్తే.. ఆడపిల్లలు అనేక సమస్యల నుంచి బయటపడేందుకు అవకాశం ఉందని గవర్నర్​ అభిప్రాయపడ్డారు.

Tamilisai Speech on Womens Health Issues : ఆరోగ్య బీమాపై ప్రతి ఒక్కరికీ అవగాహన ఉండాలన్నారు. ఆరోగ్య శ్రీ, ఆయుష్మాన్ భారత్ వంటి పథకాలు పేదలకు మెరుగైన వైద్యం అందించడానికి ఉపయోగపడుతున్నట్లు గవర్నర్ గుర్తు చేశారు. ఈ సందర్భంగా గవర్నర్​ తమిళిసై పలు సూచనలు చేశారు. జీవితంలో సవాళ్లు ఎదుర్కోవాలంటే సంపూర్ణ ఆరోగ్యం అవసరం అని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరి జీవితంలో యోగా ఎంతో అవసరమని తెలిపారు. సాధారణ మెడికల్ షాపుల్లో ధరలు చూసి రోగులకు మరింత ఆరోగ్యం పాడవుతుందని ఎద్దేవా చేశారు. జనరిక్​ మందులను ప్రభుత్వం చాలా తక్కువ ధరకే విక్రయిస్తున్నట్లు గుర్తు చేశారు. ఈ కార్యక్రమానికి ఆమెతో పాటు కీర్తి రెడ్డి ఫౌండేషన్ అధ్యక్షురాలు కీర్తి రెడ్డి, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సతీమణి కావ్య రెడ్డి హాజరయ్యారు. అనంతరం వైద్య శిబిరంలో పాల్గొన్న పలువురికి కేంద్ర ప్రభుత్వం అందిస్తోన్న ఉచిత కిట్లను పంపిణీ చేశారు.

Governor Tamilisai Comments on CM KCR : ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వంపై గవర్నర్ మరోసారి విమర్శలు చేశారు. తెలంగాణలో ఎన్నో అవరోధాలు ఎదుర్కొంటున్నానని.. అవరోధాలను అవకాశాలుగా మార్చుకోవడమే తన బలమని పేర్కొన్నారు. గత రెండేళ్లుగా ఆరోగ్య శాఖ అధికారులు తనకు అందుబాటులో లేరన్న గవర్నర్​.. పరిస్థితులను ఆస్వాదిస్తూ, వాటికి తగినట్లు స్పందించడం ద్వారా పని భారం లేకుండా చేసుకోవచ్చని స్పష్టం చేశారు.

"నేను తమిళనాడు డాక్టర్​ను. అదే సమయంలో తెలంగాణ సోదరిని. అందరూ ఆరోగ్యంగా ఉండాలని ప్రతి రోజు దేవుడిని పూజిస్తున్నా. మహిళలు తమ సమస్యలు బయటకు చెప్పడానికి ముందుకు రావాలి. లైంగిక వేధింపులపై ఆడపిల్లలకు బాల్యం నుంచి అవగాహన కల్పించాలి. మనం డబ్బును లెక్కబెడుతున్నాం కానీ క్యాలరీలు లెక్కిస్తున్నామా? ఒక్క మహిళ విజయం 1000 మంది పురుషుల విజయంతో సమానం. రెండేళ్లుగా ఆరోగ్య శాఖ అధికారులు నాకు అందుబాటులో లేరు. అవరోధాలను అవకాశాలుగా మార్చుకోవడమే నా బలం. తెలంగాణలో ఎన్నో అవరోధాలు ఎదుర్కొంటున్నా. అవరోధాలను అవకాశాలుగా మల్చుకోవడమే నా బలం."- తమిళిసై సౌందర రాజన్​, గవర్నర్‌

ఇవీ చదవండి:

Last Updated : Jun 11, 2023, 4:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.