ETV Bharat / state

రాజ్​భవన్​లో ఘనంగా న్యూఇయర్​ వేడుకలు - నూతన సంవత్సర వేడుకలు

New Year Celebrations in Rajbhavan : రాజ్​భవన్​లో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. రాష్ట్ర ప్రజలందరూ ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని గవర్నర్​ తమిళిసై సౌందరరాజన్​ కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, ప్రజలు పాల్గొన్నారు.

New Year celebrations in Rajbhavan
గవర్నర్​ తమిళిసై
author img

By

Published : Jan 1, 2023, 3:46 PM IST

New Year celebrations in Rajbhavan : రాజ్‌భవన్‌లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ నూతన సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రజా దర్బార్‌లో గవర్నర్ కేక్ కట్‌ చేసి తెలంగాణ సమాజాన్ని ఉద్దేశించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలతో తనకున్న ప్రత్యేక అనుబంధాన్ని గవర్నర్ గుర్తు చేసుకున్నారు.

ఈ ఏడాది రాష్ట్ర ప్రజలకు సకల సౌకర్యాలు కలగాలని గవర్నర్ ఆకాంక్షించారు. గతేడాది కరోనా అనేక రకాల చేదు అనుభవాలను మిగిల్చిందని అన్నారు. ఈ కరోనా వల్ల చైనా సురక్షితంగా లేదని.. కానీ మనం మాత్రం చాలా సురక్షితంగా ఉన్నామన్నారు. మన దేశం ఉపాధి, అర్థిక రంగంలో ముందంజలో ఉందని పేర్కొన్నారు.

కేంద్ర ప్రభుత్వం 81 కోట్ల మందికి ఉచిత బియ్యం ఇస్తుందని గవర్నర్ తెలిపారు. కరోనాపై కేంద్ర ప్రభుత్వ చొరవలను ఐక్య రాజ్యసమితి కూడా ప్రశంసించిందని గవర్నర్ హర్షం వ్యక్తం చేశారు. కేంద్రం తీసుకున్న అనేక రకాల చర్యల వల్లే కరోనా పూర్తిగా అదుపులోకి వచ్చిందని గవర్నర్ వివరించారు. ఈ కార్యక్రమంలో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులతో పాటు ప్రజలు పాల్గొన్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.