Governor Attender Died: గవర్నర్ తమిళిసై సౌందరాజన్ వద్ద అటెండర్ విధులు నిర్వర్తిస్తున్న వ్యక్తి హఠాన్మరణం చెందాడు. ఉదయం సికింద్రాబాద్‌లోని స్కంధగిరి ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠాపన ఉత్సవానికి గవర్నర్ హాజరయ్యారు. పూజలు నిర్వహించిన అనంతంరం... ఆమె తిరిగి వెళ్లే సమయంలో అటెండర్ రాజు సొమ్మసిల్లి పడిపోయాడు. సిబ్బంది వెంటనే ఆయనను గాంధీ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే చనిపోయినట్లు నిర్ధరించారు.
ఆలయంలో పూజలు జరుగుతున్న సమయంలోనే ఆరోగ్య పరిస్థితి బాగా లేదని సహచరులకు చెప్పినట్టు తెలుస్తోంది. గవర్నర్ కాన్వాయ్‌లో ఆలయానికి వచ్చిన వ్యక్తి అకస్మాత్తుగా చనిపోవటంతో విషాదఛాయలు అలుముకున్నాయి. రాజ్‌భవన్ సిబ్బంది.. రాజు కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రి మార్చురీకి తరలించారు.
ఇవీ చదవండి: మహబూబాబాద్ కౌన్సిలర్ దారుణ హత్య.. నడిరోడ్డుపై గొడ్డలితో నరికి..