Governor Tamil Say Sankranthi Wishes : సంక్రాంతి పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, సీఎం రేవంత్ రెడ్డి సహా పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. పండుగ ఆనందంగా చేసుకోవాలని ఆకాంక్షించారు. తెలంగాణ ప్రజలకు గవర్నర్ తమిళి సై సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పారు. పండుగను అందరూ సంతోషంగా జరుపుకోవాలని సూచించారు. ఈ వేడుకల కోసం దిల్లీ వెళ్తున్నానని, ఇది రాజకీయ పర్యటన కాదని స్పష్టం చేశారు.
CM Revanth Reddy Wish Sankranti Festival : తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మకర సంక్రాంతి శుభాకాంక్షలు(Telangana Leaders Sankrati Wishes) తెలిపారు. పాత నిర్బంధపు చీకట్లను రూపుమాపి, కొత్త కాంతులు ఇంటింటా వెల్లి విరియాలని ఆశాభావం వ్యక్తం చేశారు. సూర్యుని కొత్త ప్రయాణం నూతన మార్పునకు నాంది పలకాలని పేర్కొన్నారు. రాష్ట్రమంతటా సంక్షేమంతో పాటు అభివృద్ధి వెలుగులు విరజిమ్మాలని ఆకాంక్షించారు. భోగ భాగ్యాలను అందించే భోగి, కొత్త కాంతులు తెచ్చే సంక్రాంతి, కనుమ పండగలను అందరూ ఆనందంగా జరుపుకోవాలని రేవంత్ రెడ్డి అన్నారు.
రాజ్‌భవన్‌లో ఘనంగా సంక్రాంతి సంబురాలు
Revanth Reddy Delhi Tour : తెలంగాణలో మొదలైన ప్రజాపాలన స్వేచ్చా సౌభాగ్యాలతో ప్రజలు సంతోషంగా పండగ సంబురాలు చేసుకోవాలని రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) తెలిపారు. సకల జనహితానికి, ప్రగతి పథానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని పునరుద్ఘాటించారు. ప్రస్తుతం రేవంత్ రెడ్డి దిల్లీ పర్యటనలో ఉన్నారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌తో సమావేశమై రాష్ట్ర అభివృద్ధికు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. అనంతరం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో ఎమ్మెల్సీ అభ్యర్దుల ఖరారుపై మాట్లాడారని పార్టీ వర్గాలు తెలుపుతున్నాయి. ఆదివారం రాహుల్ గాంధీ చేపట్టనున్న భారత్ జోడో న్యాయ్ యాత్ర ప్రారంభమయ్యే కార్యక్రమంలో పాల్గొననున్నారు. అనంతరం దావోస్‌లో జరిగే ఆర్థిక సదస్సుకు హాజరుకానున్నారు.
కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌తో సీఎం రేవంత్ భేటీ - ధాన్యం సేకరణపై చర్చ
Farmer CM KCR Wish Sankranti Festival : మరోవైపు రాష్ట్ర ప్రజలకు మాజీ సీఎం కేసీఆర్(KCR) సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజల జీవితాల్లో ఈ పండుగ సుఖసంతోషాలు నింపాలని అన్నారు. మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పారు. అందరికీ అష్ట ఐశ్వర్యాలు సిద్ధించాలని కోరారు. ఆనందోత్సాహాల మధ్య పండుగ జరుపుకోవాలని సూచించారు.
సీఎం రేవంత్‌రెడ్డి దావోస్ పర్యటన ఖరారు - ఈనెల 15న జరిగే ప్రపంచ ఆర్థిక సదస్సుకు హాజరు