రాష్ట్ర స్థాయిలో పూర్వ విద్యార్ధుల నెట్వర్క్ ఏర్పాటు కోసం విశ్వవిద్యాలయాల ఛాన్సలర్‌గా గొప్పప్రణాళిక రూపొందిస్తున్నట్లు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తెలిపారు. ఈ నెట్ వర్క్ ఏర్పాటుపై నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చింది.
విశ్వవిద్యాలయాలు, ఇతర విద్యా సంస్థలు తమ పూర్వ విద్యార్ధుల సేవలను వినియోగించుకునేందుకు కృషి చేయాలని గవర్నర్ పిలుపునిచ్చారు. విద్యా సంస్థల్లో మౌలిక వసతుల కల్పనకు, ప్రయోగశాలల అభివృద్ధికి, గ్రంథాలయాల బలోపేతానికి, విద్యార్ధులకు మేలు చేసే ఇతర ఉపయుక్త పనులకు పూర్వ విద్యార్ధుల సేవలు వినియోగించుకోవాలని సూచించారు.
పూర్వ విద్యార్ధులు గొప్ప వనరులని... వారి నైపుణ్యాలను, సాయాన్ని, అనుభవాన్ని, వారి మార్గ నిర్ధేశాలను వినియోగించుకుని విద్యా సంస్థలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకోవాలని గవర్నర్ సూచించారు. ప్రస్తుత విద్యార్ధుల ఇంటర్న్‌షిప్, ప్రాజెక్ట్ ఫండింగ్ , ఈవెంట్స్ నిర్వహణ, స్టార్టప్‌ల నిధులకు పూర్వ విద్యార్ధులు, వారి సంస్థలు సహకరించి ముందుకు తీసుకెళ్లే దిశగా ప్రయత్నాలు సాగాలని సూచించారు. పూర్వ విద్యార్ధులతో ఒక సమర్ధమైన నెట్వర్క్ ఏర్పాటు చేసేలా విశ్వవిద్యాలయాలు కృషి చేయాలని గవర్నర్ తమిళిసై చెప్పారు.
ఇవీ చూడండి: ఈ-ఆఫీస్ విధానంతో పౌరులకు వేగంగా సేవలందుతాయి: గవర్నర్