ETV Bharat / state

వచ్చే ఎన్నికల్లో ఆయనకు ఓటమి తప్పదు.. అందుకే అలా: బాల్క సుమన్ - భాజపా ఎమ్మెల్యే ఈటల రాజేందర్

Balka on Etela: భాజపా ఎమ్మెల్యే ఈటల రాజేందర్​ వ్యాఖ్యలపై ప్రభుత్వ విప్​ బాల్క సుమన్​ విమర్శలు గుప్పించారు. ఓటమి భయంతోనే ఆయన అలా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. హైదరాబాద్​లోని తెరాస కార్యాలయంలో ఆయన మాట్లాడారు.

Balka on Etela
ప్రభుత్వ విప్​ బాల్క సుమన్​
author img

By

Published : Jul 26, 2022, 4:58 PM IST

Updated : Jul 26, 2022, 6:48 PM IST

Balka on Etela: సీఎం కేసీఆర్​పై పోటీ చేస్తానంటుంటే జనం నవ్వుకుంటున్నారని ప్రభుత్వ విప్ బాల్క సుమన్​ ఎద్దేవా చేశారు. హుజురాబాద్‌లో ఓటమి భయంతోనే ఈటల రాజేందర్‌ ముఖ్యమంత్రిపై పోటీ చేస్తానంటూ కొత్త రాగం ఎత్తుకున్నారని విమర్శించారు.

ఈటల రాజేందర్​కు ఓటమి భయం పట్టుకుంది. అందుకే ఈ కొత్తరాగం. ఊరు, పేరు తెలియని వ్యక్తిని మంత్రిని చేసిన వ్యక్తి కేసీఆర్. బాగా పని చేయమంటే భూముల కబ్జాలకు పాల్పడ్డారు. హుజూరాబాద్​లో ఆయన ఓడిపోవడం ఖాయం. అందుకే సీఎంపై పోటీ చేస్తా అంటున్నరు. ఇప్పుడు ఆయన ఓ చెల్లని రూపాయి. అందుకే అలా మాట్లాడుతున్నారు.

- బాల్క సుమన్, ప్రభుత్వ విప్

కనీసం వార్డు సభ్యుడిగానైనా గెలువలేని వ్యక్తిని కేసీఆర్ చేరదీసి మంత్రిని చేశారని గుర్తు చేశారు. ఈటల రాజేందర్​ శత్రువులతో చేతులు కలిపి నమ్మిన వారినే మోసం చేశారని బాల్క సుమన్ ఆరోపించారు. మంత్రిగా ఉండి పేదల భూములు ఆక్రమించి మోసాలకు పాల్పడ్డారని మండిపడ్డారు.

వచ్చే ఎన్నికల్లో ఆయనకు ఓటమి తప్పదు.. అందుకే అలా: బాల్క సు

ఇవీ చదవండి: జూనియర్ లైన్‌మ్యాన్ పరీక్షల గోల్‌మాల్‌ కేసు.. ఐదుగురు అరెస్ట్

మూడు రోజుల క్రితమే పెళ్లి.. కూతురు, అల్లుడిని కొడవలితో నరికి హత్య

Last Updated : Jul 26, 2022, 6:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.