ETV Bharat / state

రాష్ట్రంలో ప్రతి పంచాయతీకి ఒక ప్రభుత్వ పాఠశాల ఉందా - వివరాల సేకరణపై విద్యాశాఖ కసరత్తు - Government Schools list

Government Schools in Telangana : తెలంగాణ విద్యాశాఖపై ఇటీవలే రేవంత్​రెడ్డి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో పాఠశాల లేని గ్రామ పంచాయతీ ఉండొద్దని స్పష్టం చేశారు. అలాగే మారుమూల తండాలు, గ్రామాల్లోనూ ప్రభుత్వ బడి ఉండాల్సిందేనని చెప్పారు. దీనిపై విద్యాశాఖ అధికారులు కసరత్తు చేపట్టారు. రాష్ట్రంలో ప్రతి గ్రామ పంచాయతీకి ఒక ప్రభుత్వ పాఠశాల ఉందా? లేదా? అని క్షేత్రస్థాయి నుంచి వివరాలను సేకరిస్తోంది.

Government Schools in Telangana
Government Schools
author img

By ETV Bharat Telangana Team

Published : Jan 10, 2024, 9:00 AM IST

Updated : Jan 10, 2024, 9:10 AM IST

Government Schools in Telangana : తెలంగాణలో ప్రతి గ్రామ పంచాయతీకి ఒక ప్రభుత్వ పాఠశాల ఉందా? లేదా? అని పాఠశాల విద్యాశాఖ క్షేత్రస్థాయి నుంచి వివరాలు సేకరిస్తోంది. ప్రతి పంచాయతీ పరిధిలో ఒక పాఠశాల తప్పనిసరిగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఇటీవల విద్యాశాఖ సమీక్ష సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) ఆదేశించిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో ప్రతి పంచాయతీలో ఎన్ని బడులు ఉన్నాయి? ఉన్న బడి పనిచేస్తుందా? మూతబడిందా? తిరిగి తరగతులు నిర్వహించేందుకు భవనం అనుకూలంగా ఉందా? ఒకవేళ పంచాయతీ పరిధిలో పాఠశాల లేకుంటే మరో బడి ఎంత దూరంలో ఉంది? తదితర ప్రశ్నలతో కూడిన పత్రాన్ని పాఠశాల విద్యాశాఖ అధికారులు(Education Officials) ఆయా డీఈవోలకు పంపారు. దీనిపై క్షేత్రస్థాయిలోని ఎంఈవోలు, సీఆర్‌పీలు, ఇతర సమగ్ర శిక్షాభియాన్‌ సిబ్బంది వివరాలను సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. కొద్దిరోజుల్లోనే పూర్తి వివరాలు వస్తాయని విద్యాశాఖ వర్గాలు వెల్లడించాయి.

Telangana Government Schools : తెలంగాణ వ్యాప్తంగా 12,814 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఇందులో ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలను (Government Schools) పరిగణనలోకి తీసుకుంటే మొత్తం 21,383లు ఉన్నాయి. అందులో 129 మున్సిపాలిటీలు, 17 కార్పొరేషన్లలోని (GHMC సహా) ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలు సుమారు 3000 వరకు ఉంటాయని పేర్కొంటున్నారు. కేవలం గ్రామ పంచాయతీల్లో 18,000 వరకు ప్రభుత్వ బడులు ఉన్నాయి.

Telangana government school: చాలాచోట్ల పేరుకే ఇంగ్లీషు మీడియం.. ప్రత్యేక ఉపాధ్యాయులు కరవు!

కిలోమీటరు దూరంలో బడిలేని ఆవాసాలు : రాష్ట్ర విభజనకు ముందు 8000ల పంచాయతీలు ఉండగా, అనంతరం మరో 5000ల దాక పెరిగాయి. రెండు దశాబ్దాలకు ముందు ఆపరేషన్‌ బ్లాక్‌ బోర్డు, రాజీవ్‌ విద్యామిషన్‌ కింద విద్యార్థులకు అందుబాటులో ఉంటాయని పెద్దఎత్తున పాఠశాలలు ప్రారంభించారు. విద్యా హక్కు చట్టం-2010 ప్రకారం, ప్రతి ఆవాసానికి కిలోమీటరు పరిధిలో ప్రాథమిక పాఠశాల, 3 కిలోమీటర్లలో ప్రాథమికోన్నత, 5 కిలోమీటర్ల దూరంలోగా హైస్కూళ్లను ఏర్పాటు చేయాలి. అలా చేయకుంటే విద్యార్థులకు రవాణా సౌకర్యం కల్పించాలి లేదా భత్యం ఇవ్వాలి.

రాష్ట్రంలో 45 శాతం హైస్కూళ్లలో ఇన్‌ఛార్జి ప్రధానోపాధ్యాయుల పాలన

Education Department Exercise in Schools List : విద్యాశాఖ గణాంకాల ప్రకారం సుమారు 1,900 ఆవాసాలకు చెందిన 37,000ల మంది విద్యార్థులకు నెలకు రూ.600 చొప్పున రవాణా భత్యం అందజేస్తున్నారు. ఇప్పుడు కొత్త పంచాయతీలు ఏర్పాటైనందున, కొన్నిటి పరిధిలో మాత్రమే బడులు లేకపోయి ఉండొచ్చని, ఆ సంఖ్య కొన్ని పదుల్లో ఉండొచ్చని అంచనా వేస్తున్నామని విద్యాశాఖ అధికారి ఒకరు తెలిపారు. ఆ వివరాలు కొద్ది రోజుల్లో అందుతాయని, దానిపై ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని చెప్పారు.

ఒక్క విద్యార్థీ లేరని మూతబడినవి 1,346 బడులు : విద్యార్థులు రావటం లేదని తెలంగాణ వ్యాప్తంగా 1346 పాఠశాలలను మూసివేశారు. వాటిని జీరో ఎన్‌రోల్‌మెంట్‌ బడులుగా పిలుస్తున్నారు. అయితే వాటిల్లో 1100 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. ఏటా బడిబాట(Badibata) సమయంలో కొన్ని స్కూళ్లను తెరుస్తున్నారు. పిల్లలు రావడం లేదని పాఠశాలను మూసివేసి అక్కడి ఉపాధ్యాయులను అదే మండలంలోని బడులకు డెప్యుటేషన్‌ వేస్తున్నారు.

ఆ ఉపాధ్యాయులకు మూతబడిన పాఠశాల పేరిటే వేతనాలు అందుతున్నాయి. బడులను మూసేయరాదన్న భావనతో కొత్త జిల్లాల వారీగా ఉపాధ్యాయులను జీఓ 317 ప్రకారం కేటాయించినప్పుడు కూడా జీరో ఎన్‌రోల్‌మెంట్‌ స్కూళ్లకు కూడా వారిని కేటాయించారని పాఠశాల విద్యాశాఖ అధికారి ఒకరు తెలిపారు.

Modern Teaching in Government Schools : కార్పొరేట్‌ పాఠశాలలకు దీటుగా.. మోడర్న్ టీచింగ్..!

Mana ooru Mana Badi program : భలే మంచి మాస్టార్.. 'బడిబాట'ను ఎంత బాగా ప్రచారం చేస్తున్నారో..!

Last Updated : Jan 10, 2024, 9:10 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.