ETV Bharat / state

'లేపాక్షి నంది బ్రాండ్​కు చెందిన పేపరు ఉత్పత్తులు మాత్రమే వాడాలి' - AP Government latest news

ఏపీలో అన్ని ప్రభుత్వ శాఖలు లేపాక్షి నంది బ్రాండ్​కు చెందిన పేపరు ఉత్పత్తులు మాత్రమే కొనుగోలు చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఐఐఎం బెంగళూరు చేసిన సిఫార్సుల మేరకు ప్రభుత్వ రంగ సంస్థలను ప్రోత్సహించేందుకు ఈ కార్యాచరణ చేపట్టినట్టు ప్రభుత్వం పేర్కొంది.

http://10.10.50.85:6060//finalout4/andhra-pradesh-nle/thumbnail/06-October-2020/9072420_845_9072420_1601984757323.png

author img

By

Published : Oct 6, 2020, 10:50 PM IST

ఇక నుంచి ఏపీలో అన్ని ప్రభుత్వ శాఖలు, కార్పొరేషన్లు, కమిషనరేట్లు, కలెక్టరేట్లు, ప్రభుత్వ విద్యా సంస్థలు లేపాక్షి నంది బ్రాండ్​కు చెందిన పేపరు ఉత్పత్తులు మాత్రమే కొనుగోలు చేయాలని ఆదేశాలు వెలువడ్డాయి. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్​కు చెందిన లేపాక్షినంది బ్రాండ్ నోట్ పుస్తకాలు, జిరాక్సుల కోసం కాపియర్ పేపర్లు, కార్యాలయాల్లో స్క్రిబ్లింగ్ ప్యాండ్లను మాత్రమే కొనుగోలు చేయాలని ఉత్తర్వులు జారీ అయ్యాయి.

ఐఐఎం బెంగళూరు చేసిన సిఫార్సుల మేరకు రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలను ప్రోత్సహించేందుకు ఈ కార్యాచరణ చేపట్టినట్టు ప్రభుత్వం పేర్కొంది. అంతర్జాతీయ వాణిజ్యం, స్థానిక పరిశ్రమల ప్రోత్సాహం, కంటైనర్ ఫ్రైట్ స్టేషన్లు, గోదాముల నిర్మాణం, కాగిత ఉత్పత్తుల తయారీ, లేపాక్షినంది బ్రాండ్ నోటు పుస్తకాలు తదితర ఉత్పత్తుల తయారీ కోసం.. ఏపీ స్టేట్ ట్రేడింగ్ కార్పొరేషన్​కు బదులుగా ఏపీ స్టేట్ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ పనిచేయనుంది.

ఇదీ చదవండి: అమానుషం: బాలికపై పైశాచికం.. హత్యాచారయత్నం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.