ETV Bharat / state

హైదరాబాద్​లో మరో మెట్ల బావి పునరుద్ధరణకు అధికారుల చర్యలు - Falaknuma Bus Depot Latest News

Restoration Work Falaknuma Step Well : హైదరాబాద్​లో మరో పురాతన మెట్ల బావిని పునరుద్ధరించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఫలక్​నుమా బస్​డిపోలో ఉన్న ఈ మెట్ల బావికి పూర్వవైభవానికి తీసుకొచ్చేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందించారు.

Falaknuma Step Well
Falaknuma Step Well
author img

By

Published : May 10, 2023, 10:42 PM IST

Updated : May 10, 2023, 10:55 PM IST

Restoration Work Falaknuma Step Well : హైదరాబాద్​లో మరో పురాతన మెట్ల బావి పునరుద్ధరణకు.. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్​మెంట్ అథారిటీ సిద్ధమైంది. దాదాపు 300 సంవత్సరాల క్రితం నాటి మెట్ల బావి ఫలక్​నుమా బస్​ డిపోలో ఉన్న విషయం హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ అధికారుల దృష్టికి వచ్చింది. ఇందులో భాగంగా గత నెల 3న.. ఇందుకు భాగస్వామ్యంగా ఉన్న కల్పనా రమేశ్​తో కలిసి అధికారులు డిపో లోపల ఉన్న పురాతన మెట్ల బావిని సందర్శించారు.

ఫలక్​నుమా ప్యాలెస్​కు అతి సమీపంలో ఉన్న ఈ పురాతన మెట్ల బావిని.. నిజాం తన వ్యక్తిగత ఈత కొలనుగా వాడేవారని తెలుస్తోంది. ఈ మేరకు దీని పునరుద్ధరణ కోసం తెలంగాణ ఆర్టీసీ, హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్​మెంట్ అథారిటీ , జీహెచ్ఎంసీ, సాహీ అనే ఎన్జీవో సంస్థ ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎండీఏ చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ షేక్ మీరా, జీహెచ్ఎంసీ చార్మినార్ జోనల్ కమిషనర్ సామ్రాట్ అశోక్, సొసైటీ ఫర్ అడ్వాన్స్ మెంట్ ఆఫ్ హ్యూమన్ ఎండీవోర్ జాయింట్ సెక్రెటరీ కల్పనా రమేశ్​, ఆర్టీసీ డిప్యూటీ ఆర్​ఎం వినయ్ భాను, ఫలక్​నూమా డిపో మేనేజర్ జాకీర్ హుస్సేన్, హెచ్ఎండీఏ డీఏవోలు ఎం. బద్రీనాథ్, అరుణ్ జైస్వాల్ తదితరులు పాల్గొన్నారు.

బన్సీలాల్‌పేట్‌ మెట్ల బావి పునరుద్ధరణ: గతంలోనూ బన్సీలాల్‌పేట్‌లో 3 శతాబ్దాల కిందట నిర్మించిన నాగన్నకుంట మెట్ల బావిని.. రాష్ట్ర ప్రభుత్వం, జీహెచ్​ఎంసీ, హెచ్​ఎండీఏ కలిసి పునరద్ధరించారు. 30.5 మీటర్ల పొడవు, 19.2 అడుగుల వెడల్పు, 53 అడుగుల లోతుతో అప్పట్లో ఈ కట్టడాన్ని నిర్మించగా.. దశాబ్దాలుగా నిరాదరణకు గురై, రూపురేఖలు కోల్పోయింది. దీంతో సహిత స్వచ్ఛంద సంస్థ సహకారంతో రంగంలోకి దిగిన జీహెచ్ఎంసీ మెట్లబావి పూర్వవైభవానికి చర్యలు చేపట్టింది.

మట్టి, చెత్త, వ్యర్థాలతో పూడుకుపోయిన బావిని ఎనిమిది నెలలపాటు శ్రమించి.. రూపురేఖలు మార్చివేశారు. పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసి.. పర్యాటకులను ఆకర్షించే విధంగా తీర్చిదిద్దారు. మరోవైపు భూగర్భజలాల సంరక్షణపై మన్​ కీ బాత్‌లో మాట్లాడే క్రమంలో.. ప్రధాని నరేంద్ర మోదీ ఈ బన్సీలాల్‌పేట మెట్లబావి గురించి ప్రస్తావించారు. చారిత్రక మెట్లబావికి పునర్వైభవం తీసుకొచ్చారని.. కాలక్రమేణా మట్టి, చెత్తతో నిండిన ఆ బావి అలనాటి వైభవాన్ని చాటుతోందని ప్రధాని పేర్కొన్నారు.

ఇవీ చదవండి : ఎంత అద్భుతంగా ఉందో.. బన్సీలాల్​ పేట్​ మెట్ల బావిని మీరూ చూడండి..

Heavy rain in Hyderabad : హైదరాబాద్​లో మరోమారు కుండపోత వాన.. వాహనదారులకు తప్పని ఇబ్బందులు

శిందే సర్కార్ నిలబడేనా? ఉద్ధవ్ మళ్లీ సీఎం అవుతారా?.. సుప్రీం తీర్పుపై ఉత్కంఠ!

Last Updated : May 10, 2023, 10:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.