ETV Bharat / state

తెలంగాణ ప్రభుత్వానికి ప్రతిష్ఠాత్మకమైన స్కోచ్ అవార్డు - ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్​ రంజన్

government-of-telangana-nominated-for-the-scotch-award
తెలంగాణ ప్రభుత్వానికి ప్రతిష్ఠాత్మకమైన స్కోచ్ అవార్డు
author img

By

Published : Jul 30, 2020, 8:16 PM IST

Updated : Jul 30, 2020, 9:03 PM IST

20:10 July 30

ప్రతిష్టాత్మక స్కోచ్​ అవార్డులో సత్తా చాటిన తెలంగాణ.. 3 అవార్డులు సొంతం

గుడ్ గవర్నెన్స్, టెక్నాలజీ, సమ్మిళిత వృద్ధి రంగంలో ఇచ్చే ప్రతిష్టాత్మక స్కోచ్ అవార్డుకు తెలంగాణ ప్రభుత్వం ఎంపికైంది. ఇసుక అమ్మకం, మానిటరింగ్ నిర్వహణలో రాష్ట్ర మినరల్ డెవలప్​మెంట్ కార్పొరేషన్​కు స్వర్ణం, ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ విభాగంలో బ్లాక్ చైన్ టెక్నాలజీ ఆధార ప్రాపర్టీ రిజిస్ట్రేషన్​కు గానూ గోల్డ్, టీ-చిట్స్ నిర్వహణకు గానూ వెండి అవార్డులు దక్కాయి.

మొత్తంగా రాష్ట్ర ప్రభుత్వానికి రెండు బంగారం, ఒక వెండి పతకాలు వచ్చినట్లు ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్​ రంజన్ ప్రకటించారు. కృత్రిమ మేధ, బ్లాక్​చైన్ టెక్నాలజీ ఉపయోగించి ఉత్తమ పరిష్కారాలు చూపినందుకు తెలంగాణ ప్రభుత్వానికి ఈ ఘనత దక్కిందని జయేశ్​ తెలిపారు. ఉత్తమ ప్రతిభ, పనితీరు కనబరిచి అవార్డుకు ఎంపికైనందుకు మంత్రి కేటీఆర్​ ఐటీ విభాగాన్ని అభినందించారు.  

ఇదీచూడండి: రాష్ట్రంలో పాడి పరిశ్రమను అభివృద్ధికి పటిష్ఠ చర్యలు: తలసాని

Last Updated : Jul 30, 2020, 9:03 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.