హైదరాబాద్ అమీర్‌పేటలోని సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్ కార్యాలయంలో కుల వృత్తిదారుల ఆర్థిక స్థితిగతులపై కుల సంఘం ప్రతినిధులతో ప్రత్యేక సదస్సు నిర్వహించారు. కులవృత్తులకు పూర్వవైభవం తీసుకొచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని తెరాస సీనియర్ నేత మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా సెస్ ఆడిటోరియంలో రాష్ట్రంలోని వడ్డెర వృత్తులపై సమీక్ష సమావేశం చేపట్టారు.
వడ్డెర కుల వృత్తి అభివృద్ధి కోసం...
వడ్డెర కుల వృత్తి అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని మర్రి రాజశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. వడ్డెర జీవన స్థితిగతులు, ఆర్థిక పరిస్థితులపై చర్చించినట్లు ఆయన తెలిపారు. సమగ్ర అధ్యయనంతో రూపొందించిన నివేదికను రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉప అధ్యక్షుడు వినోద్‌కుమార్ సహకారంతో ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తామన్నారు.
ప్రాతినిథ్యం లేని సంఘాలకు ప్రత్యేక గుర్తింపు
సెస్ ఆడిటోరియంలో రాష్ట్రంలోని అన్ని కుల సంఘాల ప్రతినిధులు ఆయా కుల సంఘాలతో ప్రతిరోజు సమావేశం నిర్వహించి ప్రాతినిధ్యం లేని సంఘాలకు ప్రత్యేకంగా గుర్తింపు తెచ్చేందుకు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని స్పష్టం చేశారు. తెలంగాణలో వడ్డెరలు అణగారిన వర్గాల జాబితాలో ఉన్నారని...వారిని ఆర్థికంగా, విద్యాపరంగా ఆదుకునేందుకు ప్రభుత్వం తీసుకోవాల్సిన ప్రత్యేక చర్యలపై చర్చించినట్లు పేర్కొన్నారు. అనంతరం వడ్డెర ప్రతినిధులు మర్రి రాజశేఖర్ రెడ్డికి వినతి పత్రం సమర్పించారు. కార్యక్రమంలో వడ్డెర సంఘాల నేతలు పాల్గొన్నారు.
ఇవీ చూడండి : ప్రగతి భవన్ ముట్టడికి బయలు దేరిన విపక్షనేతల అరెస్ట్