ETV Bharat / state

గ్రామ పంచాయతీలూ.. 15వ ఆర్థిక సంఘం నిధుల్నే ముందు వాడుకోండి - 15వ ఆర్థిక సంఘం నిధులు వాడుకోవాలని ప్రభుత్వ ఆదేశం

రాష్ట్రంలోని పంచాయతీలన్నీ 15వ ఆర్థిక సంఘం నిధులనే ముందుగా వాడుకోవాలని ప్రభుత్వం సూచించింది. ఈ నిధులు నూరు శాతం ఖర్చయ్యేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని తెలిపింది. ఈ మేరకు జిల్లా అధికారులకు పంచాయతీరాజ్‌ శాఖ వాట్సప్‌ ద్వారా సమాచారాన్ని పంపింది.

Telangana Government
Telangana Government
author img

By

Published : Dec 26, 2022, 10:39 AM IST

పంచాయతీలన్నీ ఇక నుంచి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 15వ ఆర్థిక సంఘం నిధులను నూరు శాతం వాడుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. కేంద్రం నిధుల నుంచి తాజాగా చెక్కులు జారీ చేయాలని, ఆ తరువాతే రాష్ట్ర నిధుల విషయాన్ని పరిశీలించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు జిల్లా అధికారులకు పంచాయతీరాజ్‌ శాఖ వాట్సప్‌ ద్వారా సమాచారాన్ని పంపింది. ఆర్థిక సంఘం నిధులను కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం నేరుగా పంచాయతీలకు ఇస్తోంది. పీఎంఎఫ్‌ఎస్‌ ద్వారా బదిలీ చేస్తోంది.

గ్రామాలవారీగా ప్రత్యేక బ్యాంకు ఖాతాలు తెరిపించి.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రానికి రావాల్సిన నిధులు రూ.1,415 కోట్లలో దాదాపు 20 శాతం విడుదల చేసింది. వాటిని రాష్ట్ర ప్రభుత్వం వినియోగించకుండా జాగ్రత్తలు తీసుకుంది. ప్రతి పనికి కొంత మొత్తాన్ని ఫ్రీజ్‌ చేసింది. గ్రామపంచాయతీలు ఆ మొత్తానికి మించి చెక్కులు జారీ చేయకుండా, కేటాయించిన పనులకే నిధులు ఖర్చు చేసేలా నిబంధనల్లో మార్పులు చేసింది.

రాష్ట్రవ్యాప్తంగా 12 వేలకు పైగా గ్రామాలకు కలిపి ప్రతినెలా రాష్ట్ర ప్రభుత్వం రూ.227.50 కోట్లు రాష్ట్ర ఆర్థిక సంఘం నిధులుగా విడుదల చేస్తోంది. ఈ నిధులను పల్లెప్రగతి, రోజువారీ కార్యక్రమాలు, ఇతర అభివృద్ధి పనులకు పంచాయతీలు ఖర్చు చేస్తున్నాయి. అయితే ఇవి గత రెండు, మూడు నెలలుగా విడుదల కావడం లేదు. అందుబాటులోని ఆర్థిక సంఘం నిధుల నుంచి జారీ చేసిన చెక్కులను ఆర్థికశాఖ ఫ్రీజ్‌ చేయడంతో గ్రామాల్లో చేపట్టిన పనులకు, వేతనాలకు చెల్లింపులు చేసేందుకు పంచాయతీలు ఇబ్బందులు పడుతున్నాయి.

నూరు శాతం ఖర్చయ్యేలా ప్రణాళికలు: ఈ నేపథ్యంలోనే ఇటీవల కేంద్రం ఇచ్చిన ఆర్థిక సంఘం నిధుల వ్యయంపై జిల్లా, మండల, గ్రామ పంచాయతీ అధికారులకు రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ సూచనలు చేసింది. రాష్ట్ర ఆర్థిక సంఘం నిధులతో జారీ చేసిన చెక్కులను వెనక్కు తీసుకోవాలని.. అందుబాటులోని కేంద్ర నిధుల నుంచి బిల్లులు చెల్లించేందుకు చెక్కులు జారీ చేయాలని పేర్కొంది. కేంద్రం ఇచ్చిన నిధులను నూరు శాతం ఖర్చయ్యేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని తెలిపింది.

ఇవీ చదవండి: పారేసుకున్న పర్సు.. యువతి ప్రాణాలను కాపాడింది.. ఎలాగంటే..?

కోటా కోవెలలో విశ్వాసాల గోడ.. కోరిక తీరాలంటూ విద్యార్థుల ఆశల రాతలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.