ETV Bharat / state

రాష్ట్రంలో రోజుకు పది లక్షల టీకాలు వేసేలా ప్రభుత్వ కసరత్తు - Telangana vaccination news

రాష్ట్రంలో గరిష్టంగా రోజుకు పది లక్షల టీకాలు వేసేలా ఏర్పాట్లు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. వీలైనంత త్వరగా అర్హులందరికీ మొదటి డోసు వ్యాక్సినేషన్ పూర్తి చేయాలన్న భావనలో ఉంది. ఇందుకోసం మరో 4,000 వ్యాక్సిన్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఈ మేరకు అవసరమైన వ్యాక్సిన్ల కోసం ఉత్పత్తిదారులతో రాష్ట్రప్రభుత్వం సంప్రదింపులు జరుపుతోంది.

రోజుకు పది లక్షల టీకాలు వేసేలా ప్రభుత్వ కసరత్తు

author img

By

Published : Apr 27, 2021, 4:21 AM IST

కొవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. అందరికీ ఉచితంగా టీకాలు వేస్తామన్న ముఖ్యమంత్రి కేసీఆర్.. వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని స్వయంగా పర్యవేక్షిస్తానని చెప్పారు. అమలు, పర్యవేక్షణ కోసం జిల్లాల వారీగా ఇన్​ఛార్జీలనూ నియమిస్తామని అన్నారు.

ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణంగా అధికారులు టీకాల పంపిణీ ప్రణాళికపై కసరత్తు చేస్తున్నారు. వీలైనంత త్వరగా రాష్ట్రంలో వ్యాక్సినేషన్ మొదటి డోసు పూర్తి చేయాలన్నది ప్రభుత్వ ఆలోచన. 45 ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సిన్ల కోసం ప్రస్తుతం రాష్ట్రంలో 1,468 కొవిడ్ టీకా కేంద్రాలు ఉన్నాయి. మే ఒకటో తేదీ నుంచి 18 ఏళ్లు పైబడిన వారికి టీకాలు వేసేందుకు కేంద్రం అనుమతించింది. ఫలితంగా అదనంగా మరో 4,000 టీకా కేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

టీకాలు సమకూర్చుకునేందుకు కసరత్తు

మిగిలిన అన్ని ఆసుపత్రులు, పాలీ క్లినిక్​లు, డయాగ్నోస్టిక్ కేంద్రాలు, హౌసింగ్ సొసైటీలు, కళాశాలలు, పాఠశాలల్లోనూ కొవిడ్ వ్యాక్సిన్ సెంటర్లు ఏర్పాటు చేయాలన్న ఆలోచనలో అధికారులు ఉన్నారు. గరిష్టంగా రోజుకు పది లక్షల టీకాలు వేసే వ్యవస్థను ఏర్పాటు చేయాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నారు. ఆ దిశగా కసరత్తు చేస్తున్నారు. ఒక్కో డోసు కోసం రెండు కోట్ల టీకాలు అవసరమవుతాయని ప్రాథమిక అంచనా. ఈ మేరకు టీకాలను సమకూర్చుకునే విషయమై ప్రభుత్వం ఇప్పటికే కసరత్తు చేస్తోంది. టీకా ఉత్పత్తిదారులతో సంప్రదింపులు జరుపుతోంది. ఇప్పటికే వాడుతున్న కొవాగ్జిన్, కొవిషీల్డ్​తోపాటు కేంద్రం అనుమతించిన స్పుత్నిక్-వి సహా జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీతోనూ చర్చలు జరుపుతున్నారు. వీలైనన్ని ఎక్కువ టీకాలను ఆయా కంపెనీల నుంచి సమీకరించుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అవసరమైన పక్కా ప్రణాళికను రూపొందించుకొని త్వరగా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

ఇదీ చూడండి: ప్రజలకు మరింత చేరువగా కొవిడ్ టీకా పంపిణీ... సర్కారు నిర్ణయం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.