ETV Bharat / state

ఏ వయసువారు ఎక్కువగా కొంటున్నారు? సరిపడా సప్లై ఉందా? మద్యంపై సర్కారు సర్వే..! - ఏపీ న్యూస్

Liquor sales in AP: మద్య నిషేధం అమలు చేస్తామని చెప్పిన ఏపీ సీఎం జగన్​ ఇప్పుడు మద్యంపై ఆదాయం ఎలా పెంచాలా అని ఆలోచిస్తున్నారు. అందువల్ల ఏపీ ప్రభుత్వం మద్యం విక్రయాలపై దృష్టిసారించింది. అమ్మకాలు ఏ సమయంలో ఎక్కువగా జరుగుతున్నాయి? మందుబాబులు ఎలాంటి మద్యం తాగటానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు? ఏ వయసు వారు ఎక్కువగా కొంటున్నారు? డిమాండ్​కు తగ్గట్లుగా మద్యం సరఫరా అవుతోందా.. లేదా? వంటి అంశాలపై ఈ సర్వే నిర్వహించింది. మరి ఆ సర్వే వివరాలు చూద్దామా..

Liquor sales in AP
Liquor sales in AP
author img

By

Published : Feb 5, 2023, 12:52 PM IST

Liquor Sales in AP: దశలవారీగా మద్య నిషేధం అమలు చేస్తామని.. మద్యంపై వచ్చే ఆదాయాన్ని క్రమంగా తగ్గించుకుంటూ వెళ్తామని పలు సందర్భాల్లో చెప్పిన ఆంధ్రప్రదేశ్​ ముఖ్యమంత్రి జగన్‌ నేతృత్వంలోని ప్రభుత్వం.. ఇప్పుడు మందుబాబులతో మరింత ఎక్కువగా తాగించటమెలా? తద్వారా ఆదాయం ఇంకా పెంచుకోవటమెలా అనేదానిపై దృష్టిసారించింది. అమ్మకాలు ఏ సమయంలో ఎక్కువగా జరుగుతున్నాయి.. మందుబాబులు ఎలాంటి మద్యం తాగటానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు? ఏ వయసువారు ఎక్కువగా కొంటున్నారు? డిమాండుకు తగ్గట్లుగా మద్యం సరఫరా అవుతోందా.. లేదా? వంటి అంశాలపై ఈ సర్వే చేయిస్తోంది.

AP Govt Survey on Liquor: లోటుపాట్లు ఎక్కడున్నాయో చూసుకుని వాటికి అనుగుణంగా మార్కెటింగ్‌ వ్యూహాలు రూపొందించుకోవటం, అమ్మకాలు పెంచుకోవటమే ఈ సర్వే లక్ష్యంగా కనిపిస్తోందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మద్యం దుకాణాల సూపర్‌వైజర్లకు ఓ ప్రశ్నావళిని పంపించింది. ఆన్‌లైన్‌లో సమాధానాలివ్వాలని ఆదేశించింది. ఇటీవల బ్రూవరీస్‌ కార్పొరేషన్‌ ఎండీ వాసుదేవరెడ్డి టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించి ఈ ప్రశ్నావళికి సమాధానాలు పంపించాలని సూపర్‌వైజర్లను ఆదేశించారు. జిల్లా పేరు, మద్యం డిపో, నియోజకవర్గం, మద్యం దుకాణం లైసెన్సు సంఖ్య తదితర వివరాలను పొందుపరిచి.. ఈ సర్వేకు సూపర్‌వైజర్లు సమాధానాలు ఇస్తున్నారు. సర్వే నిర్వహించింది.

..
..

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.