రాష్ట్ర వ్యాప్తంగా వీఆర్వో, వీఆర్ఏల సమగ్ర సమాచారాన్ని ప్రభుత్వం సేకరించింది. మండలాల వారీగా తహసీల్దార్ల నుంచి ఆ వివరాలను తెప్పించారు. ప్రస్తుతం విధుల్లో ఉన్న వీఆర్వో, వీఆర్ఏలతోపాటు సస్పెన్షన్కు గురైన, సెలవుల్లో ఉన్న వారితోపాటు ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలను తీసుకున్నారు. వారిని సమాన స్థాయిలో ఇతర శాఖల్లో విలీనం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
వారి విద్యార్హతలను కూడా సేకరించారు. వారి నియామక పత్రాలు, విద్యార్హత, కులధ్రువీకరణ పత్రాలతోపాటు సర్వీస్ రిజిస్టర్లోని మొదటి నాలుగు పేజీలను కూడా తహసీల్దార్ల నుంచి తెప్పించుకున్నారు. ఇతర శాఖల్లో సర్దుబాటు చేసేందుకు ఐచ్చికాలు ఇవ్వనున్నారు. సర్దుబాటు ప్రక్రియకు అనువుగా ఉండేలా వీఆర్వో, వీఆర్ఏల సమగ్ర వివరాలను ప్రభుత్వం సేకరించింది.
ఇదీ చూడండి : 'కాంగ్రెస్, భాజపా ఎంపీలు కలిసి వస్తారో... రారో తేల్చుకోవాలి'