ధరణి పోర్టల్‌పై అవగాహన కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, ఆర్డీవోలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాల కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లు, ఆర్డీవోలకు ధరణి పోర్టల్‌పై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రెజెంటేషన్ ఇచ్చారు. నిజామాబాద్ కలెక్టర్, జిల్లా ఉన్నత అధికారులు ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. దసరాకు ప్రారంభం కానున్న ధరణి పోర్టల్ పారదర్శకంగా, కచ్చితత్వంతో, సేఫ్ అండ్ సెక్యూర్డ్‌గా ఉంటుందన్నారు. అగ్రికల్చర్, నాన్ అగ్రికల్చర్ భూములను ఎలా రిజిస్టర్ చేసుకోవాలి, స్లాట్ బుకింగ్, లాగిన్ ఎలా చేయాలి వంటి విషయాలు అధికారులకు సీఎస్ సోమేశ్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్‌లో వివరించారు. తెలుగు, ఇంగ్లీష్లలో స్లాట్ ఉంటుందన్నారు. అమ్మేవారు, కొనేవారి వివరాలు ఇందులో ఉంటాయని తెలిపారు.
జిల్లా కలెక్టర్ల నుంచి సలహాలు, అభ్యంతరాలు అడిగి తెలుసుకున్నారు. నిజామాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి ధరణికి సంబంధించిన హార్డ్‌వేర్ అందిందని.. త్వరలోనే సమావేశం నిర్వహించి.. తహసీల్దార్లకు శిక్షణ ఇస్తామని సీఎస్‌కు నారాయణ రెడ్డి వివరించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ఆర్మూర్ ఆర్డీవో శ్రీనివాస్, బోధన్ ఆర్డీవో రాజేశ్వర్, తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: కిట్‌లో రూ.2,800 విలువ చేసే నిత్యావసరాలు, 3 దుప్పట్లు: కేటీఆర్